Begin typing your search above and press return to search.
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి డబ్బింగ్ చెప్పిన సుధీర్ బాబు...!
By: Tupaki Desk | 10 May 2020 11:13 PM ISTసూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు బావగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు సుధీర్ బాబు. కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన పాత్రలను.. కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు సుధీర్ బాబు. ఫిట్ నెస్ డ్యాన్స్ విషయంలో సుధీర్ ఏ మాత్రం రాజీ పడని సుధీర్ బాబు లాక్ డౌన్ విధించినప్పటి నుండి రెగ్యులర్ గా వర్కౌట్ వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ మధ్య మైండ్ బ్లోయింగ్ స్టంట్ చేస్తూ వీడియో పోస్టు చేసిన సుధీర్ ఇప్పుడు తాజాగా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు డైలాగ్ చెప్తూ అందర్నీ అబ్బురపరిచాడు. ''క్వారంటైన్ సమయంలో లెజెండరీ హీరో నటించిన లెజెండరీ సీన్ కి డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేశాను'' అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.
ఎన్టీఆర్ నటించిన 'దానవీరశూరకర్ణ' చిత్రంలోని 'ఏమంటి వేమంటివి' అనే పవర్ ఫుల్ డైలాగ్ ఎంత పాపులర్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికి ఈ డైలాగ్ చాలా మంది ఫోన్లలో రింగ్ టోన్ గా.. కాలర్ ట్యూన్ గా మోగుతూ ఉంటుంది. ఈ డైలాగ్ చెప్పడానికి ఈ తరం హీరోలు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఈ డైలాగ్ ని ఎంతో మంది ఎన్టీఆర్ స్టైల్ లో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ అంతగా అలరించలేకపోయారనే చెప్పవచ్చు. ఆయన మనవడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ డైలాగ్ అనేక సందర్భాల్లో చెప్పారు.. కానీ ఆయన తాతగారి రిథమ్ లో మాత్రం చెప్పలేనని స్వయంగా తారక్ ఓ సందర్భంలో వెల్లడించారు. తాజాగా సుధీర్ బాబు అదే డైలాగ్ ని తనదైన స్టైల్ లో చెప్పాడు. ఎన్టీఆర్ డైలాగ్ చెబుతున్న వీడియోని పక్కన పెట్టుకుని డబ్బింగ్ చెబుతున్నట్లుగా సుధీర్ బాబు ఈ డైలాగ్ ను చెప్పారు. ఎన్టీఆర్ మాదిరిగానే అవే హావభావాలతో.. ఒకే టైమింగ్ తో చెప్పడానికి ట్రై చేసాడు. ఎన్టీఆర్ లా ఆ డైలాగ్ ఎవరూ చెప్పలేరని సుధీర్ బాబుకి కూడా తెలిసే ఉంటుంది. కానీ ఆయన ప్రయత్నాన్ని మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉండగా సుధీర్ బాబు - నాని కాంబినేషన్ లో తెరకెక్కిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. నివేతా థామస్ - అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు.
వీడియో కోసం క్లిక్ చేయండి