Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు.. 84 నుంచి 65 వరకు

By:  Tupaki Desk   |   29 May 2019 7:52 AM GMT
సుధీర్ బాబు.. 84 నుంచి 65 వరకు
X
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం అండతో సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ నటుడిగా తనేంటో రుజువు చేసుకోవడానికి చాలానే కష్టపడుతున్నాడు సుధీర్ బాబు. మొదట్లో అతడి నటనపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఐతే నెమ్మదిగా మెరుగవుతూ వచ్చిన అతను.. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’.. ‘సమ్మోహనం’ లాంటి సినిమాలతో నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇక సినిమాల కోసం సుధీర్ తన ఫిజిక్‌ ను మార్చుకునే తీరు కూడా ప్రశంసనీయమే. స్వతహాగా క్రీడాకారుడు కావడంతో ఫిట్నెస్‌ మీద అతనెంతగానో దృష్టిసారిస్తుంటాడు. పాత్రలకు తగ్గట్లుగా అతను పలుమార్లు ఫిజిక్ మార్చుకున్నాడు. తాను తొలి సినిమా ‘ఎస్ ఎంఎస్’ చేసే సమయానికి 72 కేజీలు ఉండేవాడినని.. మధ్యలో బాలీవుడ్ మూవీ ‘బాగి’ కోసం 84 కేజీల వరకు బరువు పెరిగానని.. త్వరలో మొదలయ్యే గోపీచంద్ బయోపిక్ సినిమా కోసం 65 కిలోలకు తగ్గబోతున్నట్లు వెల్లడించాడు.

తన ఫిట్ నెస్ - బరువు ఇతర విశేషాలతో ఒక వీడియో రూపొందించి ట్విట్టర్లో పంచుకున్న సుధీర్ బాబు ఈ వివరాలన్నీ వెల్లడించాడు. ప్రస్తుతం సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నానితో కలిసి ‘వి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అతను బాగా బరువు తగ్గాడు. తన చివరి సినిమా ‘సమ్మోహనం’ చేసేటపుడు 76 కేజీల బరువున్నట్లు సుధీర్ వెల్లడించాడు. తొలి సినిమా ‘ఎస్ ఎంఎస్’కు 72 కేజీల బరువుతో మొదలుపెట్టిన తాను.. ‘ప్రేమకథా చిత్రం’ చేసేటపుడు 74 కేజీలు.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’కి 80 కేజీలు.. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’కి 79 కేజీలు.. ‘బాగి’కి 84 కేజీలు.. ‘భలే మంచి రోజు’కి 80 కేజీలు.. ‘శమంతకమణి’కి 78 కేజీలు ఉన్నట్లు తెలిపాడు. గోపీచంద్‌ బయోపిక్‌కు అత్యంత ఫిట్‌ గా ఉండాాల్సిన అవసరముందని.. తన కెరీర్లోనే అత్యల్పంగా 65 కేజీల బరువుతో ఆ సినిమా చేయబోతున్నానని అతను వెల్లడించాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి