Begin typing your search above and press return to search.

సుధీర్‌ బాబు అన్‌ లక్కీ

By:  Tupaki Desk   |   27 March 2020 12:30 AM GMT
సుధీర్‌ బాబు అన్‌ లక్కీ
X
సౌత్‌ స్టార్స్‌ ఎంతో మంది బాలీవుడ్‌ పిలుపు కోసం బాలీవుడ్‌ ఎంట్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ చిన్న పాత్ర దక్కినా కూడా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేయని వారుండరు. అయితే సుధీర్‌ బాబు మాత్రం పెద్దగా ప్రయత్నాలు చేయకుండానే బాలీవుడ్‌ లో ‘భాగీ’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో హిందీలో బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చింది.

రణబీర్‌ కపూర్‌ ఇంకా ఆలియా భట్‌ జంటగా తెరకెక్కుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్స్‌ పలువురు నటిస్తున్నారు. మన తెలుగు స్టార్‌ నాగార్జున కూడా అందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాంటి సినిమాలో సుధీర్‌ బాబుకు ఛాన్స్‌ వచ్చిన సమయంలో పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ చేయబోతున్నాను.. ఆ సినిమా కోసం తాను బరువు తగ్గాను మళ్లీ బరువు పెరిగి కనిపించాలనుకోవడం లేదు అంటూ చెప్పాడట.

రెండేళ్ల నుండి గోపీచంద్‌ బయోపిక్‌ అంటూ ఎదురు చూస్తున్న సుధీర్‌ బాబు ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్‌ విషయంలో అడుగు ముందుకు వేసినట్లుగా కనిపించడం లేదు. ఈ సమయంలో బ్రహ్మాస్త్రలో నటించినా బాగుండేది. తాజాగా ఈ విషయాన్ని సుధీర్‌ బాబు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. బయోపిక్‌ లో నటించాలనే ఉద్దేశ్యంతో బ్రహ్మాస్త్ర సినిమాను కాదన్నాను.

90 రోజుల డేట్లు అడగడంతో పాటు బరువు పెరగమనడంతో బయోపిక్‌ కు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని నేను ఆ సినిమాను వదిలేసినట్లుగా సుధీర్‌ బాబు చెప్పాడు. అటు బ్రహ్మాస్త్ర సినిమాను వదిలేసిన సుధీర్‌ ఇటు బయోపిక్‌ ను అయినా మొదలు పెట్టాడా అంటే అదీ లేదు. సో సుధీర్‌ బాబు అన్‌ లక్కీ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.