Begin typing your search above and press return to search.

చిరూ... ఓ ప్రేమ‌క‌థ చెయ్య‌రూ!!

By:  Tupaki Desk   |   3 May 2018 10:27 AM GMT
చిరూ... ఓ ప్రేమ‌క‌థ చెయ్య‌రూ!!
X
ద‌శాబ్దం త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... క‌మ్ బ్యాక్ మూవీతోనే నాన్‌- బాహుబ‌లి రికార్డుల‌న్నీ తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు త‌ర్వాతి సినిమా ‘సైరా’తో బాహుబ‌లి రికార్డుల‌న్నీ చెరిపేయాల‌నే క‌సితో ఉన్నాడు. అలాంటి హీరోని ఓ ప్రేమ‌క‌థ చేయ‌మ‌ని ఎవ్వ‌రైనా అడిగే సాహ‌సం చేస్తారా! అయితే మ‌హేష్ బావ సుధీర్ బాబు మాత్రం చిరూని ఈ వింత కోరిక కోరాడ‌ట‌.

మెగాస్టార్ స‌తీమ‌ణి సురేఖ‌- సుధీర్ బాబు త‌ల్లి మంచి స్నేహితులు. ఆ అనుబంధంతోనే సుధీర్ బాబు సినిమా ‘స‌మ్మోహ‌నం’ టీజ‌ర్ లాంచ్ చేసేందుకు వ‌చ్చాడు చిరంజీవి. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్నసుధీర్ బాబు- చిరంజీవిని క‌లిసేందుకు డ‌ల్లాస్ న‌గరానికి వెళ్లాడ‌ట‌. అక్క‌డ ఇద్ద‌రూ క‌లిసి స‌న్నిహితంగా మాట్లాడుకున్నాడ‌ట‌. మాట‌ల్లో సుధీర్‌... ‘సైరా సినిమా త‌ర్వాత మీరు ఓ మంచి ప్రేమ‌క‌థ సినిమాలో న‌టిస్తే బాగుంటుంది... రుద్ర‌వీణ లాంటి అచ్చ తెలుగు సినిమా పేర్ల‌తో సినిమాలు తీసిన మీరు... ఓ అచ్చ తెలుగు ప్రేమ‌క‌థ తీయొచ్చు క‌దా!’ అని అడిగాడ‌ట‌. సుధీర్ కోరిక‌కు షాక్ అయిన చిరంజీవి... ‘ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించ‌డ‌మంటే నాకూ ఇష్ట‌మే కానీ ఈ వ‌య‌సులో నేను ల‌వ్ స్టోరీ తీస్తే జ‌నాలు ఏమ‌నుకుంటారు. నా వ‌య‌సుకి త‌గిన క‌థ వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా!’ అంటూ మాటిచ్చాడు.

సుధీర్ బాబు ప్ర‌స్తుతం ‘స‌మ్మోహ‌నం’ అనే పూర్తి ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టిస్తున్నాడు. అందుక‌ని చెప్పి మెగాస్టార్ ని కూడా ల‌వ్ స్టోరీ చేయ‌మంటే.. ఎలా? ఇప్ప‌టికే 62 ఏళ్ల చిరంజీవి ‘ఖైదీ నెం. 150’ లో ‘అమ్మ‌డు... లెట్స్ డూ కుమ్ముడు’ అంటూ కాజ‌ల్ అగ‌ర్వాల్ తో క‌లిసి చిందేసినందుకే ఆయ‌న‌పై అనేక కామెంట్లు వినిపించాయి. బాలీవుడ్లో లాగా ఇక్క‌డ లేటు వ‌య‌సు ప్రేమ‌క‌థ‌లు ఆడ‌వ‌ని సుధీర్ బాబు గ్ర‌హంచ‌ట్లేదు పాపం!