Begin typing your search above and press return to search.
బావ గురించి సుధీర్ షాకింగ్ కామెంట్
By: Tupaki Desk | 1 May 2019 5:39 PM GMTసూపర్ స్టార్ మహేష్ నటించిన ప్రతి సినిమా ఈవెంట్ కి సుధీర్ బాబు ఒక అతిధిగా విచ్చేస్తుంటారు. శ్రీమంతుడు.. భరత్ అనే నేను సహా ప్రతి ఈవెంట్లో ఆయన కనిపించారు. ప్రతి సందర్భంలో బావ మహేష్ పై సుధీర్ బాబు ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. తన నుంచి హీరోగా ఎంతటి స్ఫూర్తి పొందాడో రివీల్ చేస్తుంటారు సుధీర్. ఆ రకంగా మహేష్ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈసారి కూడా తనదైన శైలిలో మరోసారి బావ మహేష్ ని పొగిడేశారు సుధీర్ బాబు.
ముఖ్యంగా మహేష్ గురించి ఓ కొత్త కోణాన్ని టచ్ చేస్తూ.. మహేష్ తన కెరీర్ లో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఎంచుకున్న కథలకు గౌరవం దక్కిందని పొగిడేశాడు. బహుశా బ్రహ్మోత్సవం.. స్పైడర్ లాంటి సినిమాల గురించి మహేష్ పైవిధంగా ప్రస్థావించి ఉండొచ్చు. ఎన్నో అంచనాల నడుమ వచ్చి డిజాస్టర్లు గా నిలిచిన ఆ చిత్రాలు మహేష్ ని ఎంతో టెన్షన్ కి గురి చేశాయి. ఇకపోతే .. ఈ వేదికపై హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ - ``ఈ సినిమాకు పనిచేసిన అందరితో నాకు మంచి పరిచయం ఉంది. దిల్‌రాజుగారి తొలి సినిమాను నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. అశ్వినీదత్‌గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. పివిపిగారు నేను బ్యాడ్మింటన్ ఆడేటప్పటి నుండి పరిచయం ఉంది. ఇక వంశీ పైడిపల్లి నేను చెడ్డి దోస్తులం. ఒకే రూంలో కలిసి ఉన్నాం`` అని తెలిపారు.
ఎలాగైతే ఓ పండుగాడో.. మురారి.. అజయ్... హర్ష ఈ పాత్రలన్నీ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయాయో అలాగే రిషి క్యారెక్టర్ నిలిచిపోతుందని భావిస్తున్నాను. మహర్షి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు. మునుపటితో పోలిస్తే సుధీర్ బాబు మాటల్లో పరిణతి భేషుగ్గా ఉందనడంలో సందేహం లేదు.