Begin typing your search above and press return to search.
'లవ్ స్టోరీ' నిర్మాతలతో సుధీర్ బాబు సినిమా ప్రారంభం..!
By: Tupaki Desk | 20 Dec 2021 5:23 PM ISTసూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నారు. దీని కోసం విభిన్నమైన కథలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు. ఇటీవల 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రంతో మెప్పించిన సుధీర్.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదే క్రమంలో తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.
సుధీర్ బాబు తన కెరీర్ లో 15వ చిత్రాన్ని ఎం. హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన హర్షవర్ధన్.. 'గుండెజారి గల్లంతయ్యిందే' 'మనం' 'చిన్నదానా నీకోసం' 'గురు' వంటి సినిమాలకు డైలాగ్ రైటర్ గా పని చేశారు. ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ తో సుధీర్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇటీవల 'లవ్ స్టొరీ' తో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి సంస్థ ఈ చిత్రాన్ని బ్యాంక్ రోల్ చేస్తోంది. సోనాలి నారంగ్ మరియు సృష్టి సమర్పణలో నారాయణ్ దాస్ కె నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
#Sudheer15 చిత్రాన్ని ఈరోజు సోమవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తం షాట్ కి క్లాప్ బోర్డ్ కొట్టిన నిర్మాత పుస్కూర్ రామ్‌మోహన్ రావు.. దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబు - హర్షవర్ధన్ లతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.
వినూత్నమైన కాన్సెప్ట్ తో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబుని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ మూవీలో ప్రముఖ నటీనటులు - అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు భాగం అవుతున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. పిజి విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.