Begin typing your search above and press return to search.

సుధీర్.. నారా.. మళ్లీ కలుస్తున్నారు

By:  Tupaki Desk   |   26 May 2017 4:47 AM GMT
సుధీర్.. నారా.. మళ్లీ కలుస్తున్నారు
X
డిఫరెంట్ మూవీస్ చేయడంలో నారా రోహిత్ ముందుంటాడు. కేరక్టర్ ఆధారిత సినిమాలు కాకుండా.. కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తో మెప్పించేస్తుంటాడు. ఈ టైపు కేరక్టర్లలకు నారా రోహిత్ వాయిస్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ నారా హీరో వీరభోగ వసంతరాయలు అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మహేష్ బాబు బావ సుధీర్ బాబును తీసుకున్నారనే న్యూస్ హల్ చల్ చేస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్ ఆసక్తికరంగా ఉంది. ఇదే మూవీలో యంగ్ హీరో శ్రీవిష్ణు ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మరో వైపు సౌత్ బ్యూటీ శ్రియా శరణ్ ను ప్రధాన పాత్ర కోసం అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు సుధీర్ బాబును లైన్ లో పెట్టారు. నిజానికి వీరభోగ వసంతరాయలు చిత్రాన్ని అనౌన్స్ చేసినపుడు.. ఈ పాత్రలో సత్య కనిపిస్తాడని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పాత్రను సుధీర్ బాబుకు ఆఫర్ చేశారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు ఆర్. ఇంద్రనీల్ ఈ సినిమాను రూపొందించనున్నాడు.

ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో కొత్త యాంగిల్ లో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. హీరో- హీరోయిన్- విలన్ టైపు స్టోరీ కాకుండా.. మూడు పాత్రలకు మూడు వేర్వేరు కథలు ఒకేసారి నడుస్తుంటాయని.. అన్నీ కలిసి ఓ మిస్టరీ క్లైమాక్స్ కు చేరుకుంటాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని తెలుస్తోంది. అయితే.. నారా రోహిత్- సుధీర్ బాబు.. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న శమంతక మణి చిత్రంలో కలిసి నటిస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/