Begin typing your search above and press return to search.

మణిరత్నం టైటిల్ పై కన్నేసిన వర్మ

By:  Tupaki Desk   |   20 Nov 2018 5:45 PM GMT
మణిరత్నం టైటిల్ పై కన్నేసిన వర్మ
X
యువ హీరో శర్వానంద్ - సుధీర్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే యాభై శాతం పైగా పూర్తయిందట. ఇందులో శర్వానంద్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడని సమాచారం. అంటే 'నాయకుడు' సినిమాలో కమల్ హాసన్ టైపులో ఒక యువకుడి పాత్రతో పాటు నలభై ఏళ్ళ వయసుండే మాఫియా లీడర్ పాత్ర కూడా పోషిస్తున్నాడట.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు 'దళపతి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. మణిరత్నం డైరెక్షన్లో రజనీకాంత్.. మమ్ముట్టి హీరోలుగా 'దళపతి' అనే పేరుతో ఒక సూపర్ హిట్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చాలామంది సినిప్రియులు ఆ సినిమాను ఒక క్లాసిక్ లాగా పరిగణిస్తారు. అలాంటి సినిమా టైటిల్ ని శర్వా సినిమాకు వాడడం విశేషమే. ఆ టైటిల్ కి తగ్గట్టు కథ కూడా పవర్ ఫుల్ గా ఉంటుందో లేదో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకంటే ముందుగా శర్వానంద్ హీరో గా హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కిన 'పడి పడి లేచే మనసు' డిసెంబర్ 21 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇది ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని సమాచారం. ఈ లవ్ స్టొరీ తర్వాత హార్డ్ గా ఉండే మాఫియా డాన్ కథ అన్నమాట.