Begin typing your search above and press return to search.

ఆకట్టుకునేలా 'సూఫీయుమ్ సుజాతయుమ్’ ట్రైలర్...!

By:  Tupaki Desk   |   25 Jun 2020 7:00 AM IST
ఆకట్టుకునేలా సూఫీయుమ్ సుజాతయుమ్’ ట్రైలర్...!
X
మలయాళ నటుడు జయసూర్య - హీరోయిన్ అదితిరావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘సూఫీయుమ్ సుజాతయుమ్’. ఈ సినిమా జులై 3న డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది. మలయాళం సినిమా చరిత్రలో ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల కాబోతున్న మొదటి సినిమాగా 'సూఫీయుమ్ సుజాతయుమ్' నిలవనుంది. ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేయడానికే మొగ్గు చూపింది. ఈ క్రమంలో తాజాగా ప్రైమ్ నుండి 'సూఫీయుమ్ సుజాతయుమ్’ ట్రైలర్ విడుదలైంది.

'సూఫీయుమ్ సుజాతయుమ్’ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ఒక కవితాత్మకంగా చెప్పబడిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది. ఈ సెన్సిబిల్ ప్రేమకథలో కులాలను మతాలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అదితిరావ్ హైదరీ తన లుక్స్ తో గ్రేస్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఈ ట్రైలర్ ఆద్యంతం అలరించింది. సినిమాటోగ్రాఫర్ అను మూతేదత్ అందించిన విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. హృదయాన్ని హత్తుకునేలా జయచంద్రన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఒక దైవదూత.. ఒక ఆధ్యాత్మిక సంచారి.. ఒక శాశ్వతమైన ప్రేమకథ అంటూ సాగిన ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమాకు నరణిపుళ శనవాస్ దర్శకత్వం వహించగా ఫ్రైడే ఫిలిం హౌస్ బ్యానర్ పై విజయ్ బాబు నిర్మించారు. కాగా 'సూఫీయుమ్ సుజాతయుమ్’ 14 సంవత్సరాల తర్వాత మలయాళం సినిమాలో అదితిరావ్ హైదరీ నటించిన చిత్రమని తెలుస్తోంది. ఆమె ఇంతకముందు మమ్ముట్టి నటించిన 'ప్రజాపతి' సినిమాలో కనిపించింది. ఈ సినిమా జూలై 3న ప్రైమ్ లో విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ అయిన అన్ని చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఓటీటీలలో రిలీజైన సినిమాలన్నీ నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుండగా మరి ఈ మలయాళ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.