Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ ని వద్దంటున్నారు

By:  Tupaki Desk   |   6 Dec 2017 9:39 AM GMT
కళ్యాణ్ రామ్ ని వద్దంటున్నారు
X
నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ గానే ఉన్నాడు. ఒకవైపు నిర్మాతగా.. మరోవైపు హీరోగా సినిమాలు చేసేస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ నందమూరి కుర్రాడు ఎమ్మెల్యే అంటూ ఓ సినిమా చేస్తున్నాడు.

కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. పొలిటికల్ టచ్ తో సాగనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజకీయ నేపథ్యంతో ఈ మూవీ కథ ఉంటుందనే సంగతి టైటిల్ లోనే అర్ధమవుతోంది. ఇప్పుడు మరో పొలిటికల్ మూవీపై కూడా కళ్యాణ్ రామ్ కన్నేశాడనే న్యూస్ వస్తోంది. మలయాళంలో దిలీప్ హీరోగా రూపొందిన రామ్ లీలా చిత్రం ఈ హీరోకు తెగ నచ్చేసిందట. రీమేక్ చేసేందుకు రెడీ అయిపోయాడని కూడా అంటున్నారు. అయితే.. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ రీమేక్ చేయకుండా ఉండడమే నయం అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

కథ ప్రకారం చూస్తే.. ఓ పార్టీ నాయకుడు హత్యకు గురైతే అతని కుమారుడు అవతలి పార్టీపై నాయకులపై ప్రతీకారం తీర్చుకునే కాన్సెప్ట్ తో ఈ సినిమా కథ ఉంటుంది. ఇది ప్రస్తుతం అధికారంలో ఉన్న తమ కుటుంబానికి చెందిన పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండడంతోనే.. కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా చేయద్దనే సలహాలు ఇస్తున్నారట. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమయంలో.. ఫ్యామిలీ వ్యక్తులకు ఇబ్బంది కలిగించే చిత్రం పై కళ్యాణ్ రామ్ ఎలాంటి డెసిషన్ తీస్కుంటాడో చూడాలి.