Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ డిగ్రీ పూర్తి.. మామ్ సంబ‌రం!

By:  Tupaki Desk   |   29 Jun 2019 8:28 AM GMT
స్టార్ కిడ్ డిగ్రీ పూర్తి.. మామ్ సంబ‌రం!
X
కింగ్ ఖాన్ షారూక్ - గౌరీ ఖాన్ ల‌ గారాల ప‌ట్టీ సుహానా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. గ‌త కొంత‌కాలంగా రెగ్యుల‌ర్ గా వార్త‌ల్లో నిలుస్తోంది సుహానా. వోగ్ క‌వ‌ర్ షూట్ తో అస‌లు హీట్ మొద‌లైంది. నాటి నుంచి సుహానాకు సామాజిక మాధ్య‌మాల్లో ఫాలోవ‌ర్స్ అసాధార‌ణంగా పెరుగుతూనే ఉన్నారు. ఇక సోష‌ల్ మీడియాలో నిరంత‌రం ఏదో ఒక కొత్త ఫోటోని లేదా వీడియోల్ని పోస్ట్ చేస్తూ సుహానా వేడి పెంచుతూనే ఉంది.

డిగ్రీ పూర్త‌వ్వ‌క‌ముందే కథానాయిక అవ్వాల‌న్న డ్రీమ్ ని సుహానా ఏమాత్రం దాచుకోలేదు. మీడియా ముఖంగానే న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తిని వ్య‌క్త‌ప‌రిచింది. డాడ్ షారూక్ సైతం స్వ‌యంగా సుహానా ఆస‌క్తి గురించి వెల్ల‌డించారు. ఆర్య‌న్ ఖాన్ న‌టుడు అయ్యేందుకు ఆస‌క్తిగా లేడు. కానీ సుహానా హీరోయిన్ అయ్యేందుకు ఆస‌క్తిగా ఉంద‌ని వెల్ల‌డించారు ఖాన్.

ఈ స్టార్ కిడ్ హీరోయిన్ అవ్వ‌క‌ముందే ఓ శుభ‌వార్త‌ను చెప్పింది. సుహానా లండ‌న్ ఆర్డింగ్ లీ కాలేజ్ (సుస్సెక్స్)లో డిగ్రీ పూర్తి చేసింది. ప‌ట్టా అందుకోవ‌డ‌మే త‌రువాయి. ఈ గుడ్ న్యూస్ ని సుహానా మామ్ గౌరీఖాన్ స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల ద్వారా రివీల్ చేశారు. అలాగే సుహానా హ్యాపీ మూవ్ మెంట్ కి సంబంధించిన ఓ ఫోటోని గౌరీఖాన్ షేర్ చేశారు. అంతేకాదు కాలేజ్ డేస్ లో సుహానా స్టేజీ డ్రామా కాంపిటీస‌న్స్ లో అందుకున్న ర‌సెల్ క‌ప్ ని షేర్ చేశారు. ఆ ర‌కంగా న‌ట‌నపై త‌న‌కు ఉన్న ఆస‌క్తిని రివీల్ చేశారు. డిగ్రీ ప‌ట్టా.. ర‌సెల్ క‌ప్ అందుకుంది స‌రే.. షారూక్ వార‌సురాలిగా ఆయ‌న లెగ‌సీని ముందుకు తీసుకెళ్ల‌డంలో ఏ మేర‌కు సాహ‌సాలు చేయ‌నుంది? అన్న‌ది చూడాల్సి ఉందింకా. సుహానా డెబ్యూ మూవీ ఎలా ఉండ‌బోతోందో కానీ.. ఈలోగానే న‌ట‌న‌లో పూర్తి స్థాయిలో శిక్ష‌ణ పొంద‌నుంద‌ని తెలుస్తోంది.