Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: షాకిస్తున్న కింగ్ ఖాన్ న‌ట‌వార‌సురాలి మేకోవ‌ర్

By:  Tupaki Desk   |   6 April 2021 3:30 PM GMT
ఫోటో స్టోరి: షాకిస్తున్న కింగ్ ఖాన్ న‌ట‌వార‌సురాలి మేకోవ‌ర్
X
అంతా అనుకున్న‌ట్టు అయితే కింగ్ ఖాన్ షారూక్ ఈపాటికే త‌న వార‌సురాలు సుహానా ఖాన్ ని క‌థానాయిక‌ను చేసేవారే. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ ఫిలింమేక‌ర్స్ సుహానా రాక కోసం వేయి క‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు. కానీ సుహానా రాక అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. బ‌హుశా క‌రోనా క్రైసిస్ ఈ న‌ట‌వార‌సురాలి రాక‌ను అడ్డ‌గించ‌డంలో ముఖ్య పాత్ర పోషించింద‌ని భావించినా కానీ.. షారూక్ త‌న కుమార్తె ఎంట్రీపై చాలా స్ప‌ష్ఠ‌త‌తోనే ఉన్నారు.

``సుహానా నటి కావాలంటే మరో మూడు నాలుగు సంవత్సరాలు నటన నేర్చుకోవాలి. నా పిల్లలు నటించడం ప్రారంభించాలని నా పరిశ్రమ స్నేహితులు చాలా మంది భావిస్తున్నారని నాకు తెలుసు. కానీ వారు ఇంకా నటించడం ప్రారంభించకూడదనేది నా నమ్మకం`` అంటూ షారూక్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించ‌డాన్ని బ‌ట్టి సుహానా శిక్ష‌ణ పూర్త‌వ్వ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని భావించాల్సి వ‌స్తోంది.

ఇక షారూక్ లా చిలిపిత‌నం అల్ల‌రిత‌నంతో సుహానా పెద్ద తెర‌పై మెరుపులు మెరిపిస్తుంద‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నా రాక ఆల‌స్య‌మ‌వుతోంది. ఈలోగానే సుహానా త‌న సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెంచుకోవ‌డంలో ఏ ఇత‌ర స్టార్ తో పోల్చినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇంకా తెరంగేట్రం చేయ‌కుండానే ల‌క్ష‌లాది మంది ఇన్ స్టా ట్విట్ట‌ర్ లో త‌న‌ని అనుస‌రిస్తున్నారు.

ఇంత‌కుముందు తాను న‌ట‌శిక్ష‌ణ‌లో ఉన్న‌ప్పుడు కొన్ని ఫోటోలను వీడియోల్ని షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. ఫిలింమేకింగ్ కి సంబంధించిన చాలా విష‌యాల్ని సుహానా షేర్ చేశారు. ఇటీవ‌ల సుహానా గోధుమ వ‌ర్ణం వివాదం కూడా సంచ‌ల‌న‌మే అయిన సంగ‌తి తెలిసిందే. స్టార్ డాట‌ర్ ఎమోష‌న‌ల్ గా నెటిజ‌నుల‌పై ఎటాక్ చేయ‌డంతో దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

తాజాగా సుహానా బ్లాక్ డ్రెస్ లో గ్లామరస్ ఫోటోని షేర్ చేయ‌గా దానికి అద్భుత స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. సుహానా కేవలం రెండు ఎమోజీలతో ఈ రెండు చిత్రాలను షేర్ చేశారు. హాఫ్ షోల్డ‌ర్ లుక్ తో బ్లాక్ డ్రెస్ లో సుహానా ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నారు. సుహానా చిన్ననాటి స్నేహితురాలు నవ్య నవేలి నందా హెల్ప్ లెస్ అంటూ స్పందించింది.
సుహానా బంధువు .. గౌరీ ఖాన్ మేనకోడలు అలియా చిబా `అవ్ క్యూటీ` అని స్పందించారు. ఒక అభిమాని.. `సరే.. చెంప ఎముకలు` అని వ్యాఖ్యానించ‌గా.. చాలా మంది క్యూటీ అని ఓహ్ మైగాడ్ అని.. బ్ర‌హ్మాండం అని స్పందించారు.

ఈ ఫోటోల్లో సుహానా చాలా సింపుల్ అలంక‌ర‌ణతో క‌నిపిస్తోంది‌. ఆ మెడ చుట్టూ ఉన్న స్లిమ్ బంగారు గొలుసు పాత కాలం ట్రెడిష‌న్ ని ఆవిష్క‌రిస్తోంది. తీరైన క‌నుబొమ‌లు పాపా షారూక్ ను త‌ల‌పించే చిరునవ్వు ను ఎంత దాచేయాల‌నుకున్నా ద‌గ‌డం లేదు ఈ ఫోటోలో.

న్యూయార్క్ లో న‌ట‌శిక్ష‌ణ తీసుకుంటున్న సుహానా తరచుగా ఆన్ ‌లైన్ ‌లో ఆకర్షణీయమైన చిత్రాలను పంచుకోగా అవి వైర‌ల్ అవుతున్నాయి. తన నటనా నైపుణ్యానికి సంబంధించిన వీడియోల‌ను కూడా సుహానా పంచుకుంది. గత ఏడాది ఆగస్టులో లాక్ డౌన్ సమయంలో ఆమె ముంబైలో ఉన్నప్పుడు తన భిన్నమైన మనోభావాల చిత్రాలను పంచుకుంది.