Begin typing your search above and press return to search.

అనన్య కోసం ఎడిటింగ్ చేసిన సుహానా!

By:  Tupaki Desk   |   12 May 2020 9:16 AM GMT
అనన్య కోసం ఎడిటింగ్ చేసిన సుహానా!
X
ప్రతి ఒక్కరికి దాదాపుగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఒక్కా..రు కూడా బెస్ట్ ఫ్రెండ్ లేరే కనీసం క్లోజ్ ఫ్రెండ్ కూడా లేరే అంటే.. అదేదో ఆలోచించాల్సిన విషయం. మీరు ప్రపంచానికి పూర్తి భిన్నం అన్నమాట. నార్త్ కొరియా దేశపు సర్వాధినేత కిమ్ ఉన్ జోంగ్ కు మిమ్మల్ని గురువుగా భావించాలి ఎందుకంటే ఆయనకు కూడా జిన్ పింగు మంచి దోస్తు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ కిడ్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ముఖ్యంగా సుహానా ఖాన్.. అనన్య పాండే.. షనయా కపూర్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్.

ఈమధ్య ఫ్రెండ్స్ అయ్యారని అనుకుంటారేమో కాదు కాదు. వీరి స్నేహం చిన్నప్పటి నుంచి కొనసాగుతోందట. అయితే ఈ మహమ్మారి కరోనా.. మాయదారి లాక్ డౌన్ దెబ్బకు ఈ ఫ్రెండ్స్ కలుసుకోలేకుండా ఉన్నారట. ఈమధ్య అనన్య తన ఇన్స్టా స్టోరీస్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఎడిట్ చేసింది ఎవరో కాదు.. సుహానా. ఎంత చక్కగా ఆ వీడియో ను ఎడిట్ చేసిందంటే అనన్య ఫ్యాషన్ ను ఆ ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోయింది. అందుకే అనిన సుహానాను టాగ్ చేసి "ఎడిటింగ్ చేసింది క్వీన్ సుహానా ఖాన్" అంటూ వెల్లడించింది.

ఇప్పటికే సుహానా 'ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ' షార్ట్ ఫిలిం లో నటించి తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. ఇక అనన్య పాండే సంగతి తెలిసిందే.. ఇప్పటికే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఫైటర్' లో నటిస్తోంది. ఇక షనయా కపూర్ విషయానికి వస్తే ఇంకా గ్లామర్ ఫీల్డ్ వైపు దృష్టి సారించలేదు.