Begin typing your search above and press return to search.
షారూక్ నటవారసురాలి కోసం బరిలో `గల్లీబోయ్` జోయా
By: Tupaki Desk | 19 Aug 2021 6:30 AM GMTకింగ్ ఖాన్ షారూక్ కుమార్తె సుహానా ఖాన్ కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితమే సుహానా తెరంగేట్రంపై ఖాన్ స్పష్ఠతనిచ్చారు. సుహానా కథానాయిక అవుతుంది. అవసరమైన నటశిక్షణ తీసుకుంటోంది.. అంటూ అప్పట్లో ఒక స్పెషల్ ఫోటోషూట్ ని షారూక్ - గౌరి దంపతులు రిలీజ్ చేయగా అది అంతర్జాలంలో సునామీ సృష్టించింది. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న షారూక్ అభిమానులు సుహానా ఆరంగేట్రం కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
సుహానా అచ్చు గుద్దినట్టు తండ్రి పోలికతో ఉంటుంది. అందువల్ల షారూక్ కి సిసలైన వారసురాలిగా అదే చిలిపిదనం గొప్ప ఆహార్యంతో అభిమానుల్ని మైమరిపిస్తుందని అప్పుడే అంచనా వేశారు. సుహానాలోనూ ఖాన్ జీ చిలిపితనం కొంటెతనం చూడాలన్న ఆరాటం అయితే తగ్గలేదు. అయితే దేనికైనా టైమ్ రావాలి. ఇప్పుడు ఆ టైమ్ వచ్చిందనే తెలుస్తోంది.
చాలా కాలంగా తన కుమార్తెను లాంచ్ చేసేందుకు సరైన వేదికను వెతుకుతున్న షారూక్ కి ఎట్టకేలకు ఆ వేదిక లభించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గల్లీ బోయ్ .. జిందగీన మిలేగా దొబారా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ సుహానాని లాంచ్ చేయనున్నారని తెలిసింది. జోయా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు.ఇంటర్నేషనల్ కామిక్ బుక్ `ఆర్చీ` భారతీయ వెబ్ సిరీస్ కి జోయా అక్తర్ దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం జోయా దిగ్గజ OTT ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అంతర్జాతీయ కామిక్ పుస్తకం ఆర్చీకి భారతీయ వెర్షన్ ను అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇది టీనేజ్ రోమ్-కామ్ అని తెలుస్తోంది. దర్శకురాలు ప్రస్తుతం తారాగణాన్ని ఖరారు చేసే పనిలో ఉన్నారు. నటీనటుల ఎంపిక ఇంకా కొనసాగుతున్నందున సినిమాలో కీలక పాత్రలో నటించడానికి సుహానా పేరును షార్ట్ లిస్ట్ చేసారని తెలిసింది. సుహానా కు నటన కొత్త కాదు. లండన్ లో `రోమియో అండ్ జూలియట్` డ్రామాలో నటించారు. కానీ ఆర్చీ ఆమె మొదటి బాలీవుడ్ చిత్రం. ఇంకా ఈ చిత్రానికి సంతకం చేయాల్సి ఉందని తెలిసింది. షారూఖ్ ఖాన్ ఆమోదించాక సుహానా సంతకం చేస్తుందట.
ఆర్చీ తన స్నేహితుల బృందంతో కలిసి తిరుగుతూ జ్ఞాపకాలను సృష్టించే కథను చెబుతుంది. భారతీయ వెర్షన్ లో రిగిడేల్ హైస్కూల్ రెగీ- జగ్ హెడ్- బెట్టీ- వెరోనికా- మూస్- మిడ్జ్- డిల్టన్- బిగ్ ఎథెల్- మిస్టర్ లాడ్జ్- మిస్ గ్రండీ- పాప్ టేట్- మిస్టర్ వెదర్ బీ- స్మిథర్స్- స్టీవెన్స్ మొదలైన పాత్రలు కూడా ఉంటాయి. . ఈ అద్భుతమైన వెంచర్ లో జోయా మరో ఇద్దరు స్టార్ కిడ్స్ ని లాంచ్ చేసేందుకు ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. అంటే సుహానాతో పాటు ముగ్గురు నటవారసురాళ్లు తెరకు పరిచయం అవుతారన్నమాట.
వర్ధమాన నటి సుహానా `ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ` అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించింది. తనదైన నటనకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిసాయి. ఈ 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కు థియోడర్ గిమెనో దర్శకత్వం వహించారు. ఇందులో రాబిన్ గొనెల్ల కూడా కీలక పాత్రలో నటించారు. జోయా అక్తర్ తెరకెక్కించిన జిందగి నా మిలేగీ దొబారా.. గల్లీ బోయ్స్ అవార్డులు రివార్డులు కొల్లగొట్టి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గల్లీ బోయ్స్ ఆస్కార్ బరికి నామినేట్ అవ్వడం నాడు సెన్సేషనల్ టాపిక్ గా నిలిచింది.