Begin typing your search above and press return to search.

వావ్ సుహానా.. షారుక్ కూతురు హీటెక్కిస్తోందిగా

By:  Tupaki Desk   |   13 Oct 2022 2:30 AM GMT
వావ్ సుహానా.. షారుక్ కూతురు హీటెక్కిస్తోందిగా
X
స్టార్ హీరోల కూతుర్లు కొన్నిసార్లు ప్రైమేసీ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరి కొందరు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వారి స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీడియా కెమెరాలు ఏమాత్రం కనిపించినా కూడా వారి గ్లామర్ తో కూడా ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ వారసులు కూడా అప్పుడప్పుడు మీడియా ముందు హైలైట్ అవుతూ ఉంటారు.

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా గ్లామర్ లుక్ తో ఈ మధ్య ఎంతగానో ఎట్రాక్ చేస్తుంది. 22 ఏళ్ల వయసులో ఉన్న సుహానా ఖాన్ బయట ఎప్పుడు కనిపించినా కూడా కెమెరాలన్నీ కూడా ఆమె వైపుకు తిరిగిపోతాయి. ఇక ఈసారి కూడా ఆమె స్టైలిష్ డ్రెస్ లో కనిపించడంతో అందరి ఫోకస్ ఆమెపైనే పడింది. పింక్ కలర్ డిఫరెంట్ డ్రెస్ లో అమ్మడు స్లీవ్ లెస్ అందాలను హైలెట్ చేసింది.

ఇక జాకెట్ చేతుల్లో పట్టుకుని జీన్స్ ప్యాంట్ లో కనిపించిన విధానం కూడా హైలెట్ అయ్యింది. చాలాకాలంగా అయితే సుహానా ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టబోతోంది అని అనేక రకాల కథనాలు అయితే వస్తున్నాయి.

కానీ ఇంతవరకు ఆమె ఆ విషయంపై పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. గతంలో అయితే ఒక ఇంగ్లీష్ షార్ట్ ఫిలింలో ఆమె నటించింది. అలాగే అమెరికాలో ప్రత్యేకంగా యాక్టింగ్ పై కోచింగ్ కూడా తీసుకుంది.

కానీ ఇంతవరకు సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ పై అయితే ఫోకస్ చేసినట్లు అనిపించలేదు. షారుక్ కూడా ఆమెకు పెద్దగా సపోర్ట్ చేసినట్లు ఎక్కడ కనిపించలేదు. ఇక సుహానా ఖాన్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటూనే ఉంది. అప్పుడప్పుడు ఆమె రంగు పై అందంపై కూడా ట్రోల్స్ వస్తూ ఉండడంతో తీవ్రస్థాయిలో విమర్శకులకు కౌంటర్లు కూడా ఇస్తుంది.

మొత్తానికి గ్లామర్ మాత్రం సుహానా ఖాన్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. మరి నటనలో కూడా కాస్త రాటు తేలితే ఈ బ్యూటీ కి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.