Begin typing your search above and press return to search.

'తూనీగా తూనీగా' సుహాని పెళ్లైంది.. వరుడు ఎవరంటే?

By:  Tupaki Desk   |   8 Sep 2022 5:40 AM GMT
తూనీగా తూనీగా సుహాని పెళ్లైంది.. వరుడు ఎవరంటే?
X
తూనీగా.. తూనీగా అన్న పాట విన్నంతనే గుర్తుకు వచ్చేస్తుంది మనసంతా నువ్వే మూవీ. అప్పట్లో ఆ సినిమా విడుదలై కాసుల వర్షం కురవటమే కాదు.. దివంగత ఉదయ్ కిరణ్ ఇమేజ్ ను అమాంతం పెంచేసింది.

ఆ సినిమాలో చిన్ననాటి రీమాసేన్ గా నటించిన సుహాని గుర్తుంది కదా? ఇప్పుడామ్మాయి పెళ్లి జరిగింది.

ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ఈ పాట విన్నంతనే చిన్నారి సుహాని గుర్తుకు వచ్చేస్తుంది. గణేష్.. ప్రేమంటే ఇదేరా.. ఎదురులేని మనిషి తదితర సినిమాల్లో బాలనటిగా.. ఆ తర్వాత హీరోయిన్ గా నటించిన సుహాని.. మ్యూజిషియన్.. మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో కలిసి ఏడు అడుగులు వేసింది.

అతి కొద్ది ముఖ్యులు.. బంధువుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. కొందరు సుహానిని చూసి.. గుర్తు పట్టలేకపోయాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి కొడుకు విషయానికి వస్తే ఢిల్లీకి చెందిన ఇతగాడికి 'యువర్స్ ఈవెంట్ పుల్లీ' అనే కంపెనీని నిర్వహిస్తున్నారు.

ఇన్స్టాలో హల్దీ వేడుకల నుంచి పెళ్లి..రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోల్ని సుహాని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.