Begin typing your search above and press return to search.
సుహాసిని పంచ్ ఆలీకే కదూ!
By: Tupaki Desk | 5 July 2016 5:47 AM GMTఅవార్డు ఫంక్షన్లు.. ఆడియో రిలీజ్ ఫంక్షన్లు.. సినిమా ఫంక్షన్లు.. కొన్నాళ్ల క్రితం వరకూ హుందాగానే జరిగేవి. ఎప్పుడో ఒకటీ అరా ఆరోపణలు మినహా.. పెద్దగా వివాదాలు చోటు చేసుకునేవి కాదు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారిపోయింది. ప్రతీ ఫంక్షన్ లోనూ ఏదో ఒక కాంట్రవర్సీ బయల్దేరుతోంది. ముఖ్యంగా హీరోయిన్లు - మహిళలపై వేస్తున్న జోక్స్ మితిమీరుతున్నాయనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా ఆలీ చుట్టూరా తిరిగిన విషయం తెలిసిందే.
మహిళలను కించపరుస్తూ చేస్తున్న కామెంట్స్ పై.. సైమా అవార్డ్ ఫంక్షన్ లో సీనియర్ నటి సుహాసిని చేసిన కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'మీరు చాలా చక్కగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీ సెన్సాఫ్ హ్యూమర్ తో మమ్మల్ని నవ్వించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను తప్పకుండా అభినందించాల్సిందే. కానీ మీ అందరినీ నేను ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. మహిళలు - పిల్లలపై కుళ్లు జోకులు వేయడం మానేయండి. అది అంత మంచిది కాదు' అంటూ చెప్పుకొచ్చారు సుహాసిని.
సుహాసిని ఎక్కడా ఇలాంటి సలహాలివ్వడం లాంటివి చేయరు. కానీ ఓ అవార్డ్ ఫంక్షన్ లో స్టేజ్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం చూస్తే.. ఆమె ఎంతగా హర్ట్ అయ్యారనే విషయం అర్ధమవుతుంది. ఆమె చెప్పిన ఈ సలహా - సూచన.. ఒక్క ఆలీకే కాదు.. ఇలాంటి కామెంట్స్ చేస్తున్న అందరికీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా!