Begin typing your search above and press return to search.
మెగాస్టార్ జోడీలలో ఆ క్రెడిట్ ఆమెకే దక్కింది!
By: Tupaki Desk | 22 July 2022 11:30 PM GMTఏ భాషలోనైనా సినిమానే ప్రధానమైన వినోద సాధనం. ఏ కథలోనైనా హీరోతో పాటు హీరోయిన్ ఉండవలసిందే. హీరోలకి స్టార్ డమ్ ఎక్కువగా ఉంటుంది .. కానీ ఆయన తోడుగా అందమైన హీరోయిన్ ఉన్నప్పుడే ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతారు.
అంతేకాదు హీరోకి బలమైన సెంటిమెంట్ హీరోయిన్. సమాజం కోసం పోరాడే హీరోకి హీరోయిన్ సపోర్టు ఉండాల్సిందే. ఒక్కోసారి హీరోయిన్ ను సొంతం చేసుకోవడమే హీరోగా ఆశయంగా ఉంటుంది. దానిని కూడా తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే హీరోకి కూడా ఒక తోడు ఉండాలనే మంచి మానసుతోనే ప్రేక్షకులు ఆలోచన చేస్తారు.
ఆయితే హీరోయిన్స్ విషయానికి వస్తే తెరపై కొన్ని చిత్రాలు .. విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఎన్టీ రామారావుకి మానవరాలిగా తెరపై అల్లరి చేసిన శ్రీదేవి ఆయన సరసన కథానాయికగా సందడి చేసింది. రజనీకాంత్ కూతురుగా తెరపై కనిపించిన మీనా, ఆయన జోడీగా 'ముత్తు'లో ఒక ఊపు ఊపేసింది. ఇక ఆ హీరోల సరసన నాయికలుగా సందడి చేసిన కొంతమంది, ఆ తరువాత కాలంలో అదే హీరోలకు అక్కగాను .. అమ్మగాను చేసిన వారున్నారు. స్టార్ హీరోల కెరియర్ చాలా కాలం పాటు నిలకడగా ఉంటుంది. కానీ హీరోయిన్స్ కెరియర్ గ్రాఫ్ అలా సాగదు.
ఈ విషయంలో హీరోయిన్స్ పెళ్లి ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కొంతకాలం పాటు ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్స్ ఆ తరువాత పెళ్లి చేసుకుంటారు. పిల్లల ఆలనా పాలన చూస్తూ ఇంటిపట్టున ఉండిపోతారు. పిల్లలు కాస్త ఎదిగాక మళ్లీ కెమెరా ముందుకు వస్తారు. కాకపోతే అక్క .. వదిన .. తల్లి పాత్రలతో. అలా చూసుకుంటే చిరంజీవితో ఈ పాత్రలన్నీ చేస్తూ వచ్చిన నటిగా ఒకరు కనిపిస్తారు .. ఆమెనే సుజాత. 'ప్రేమతరంగాలు' సినిమాలో చిరంజీవి సరసన కనిపించిన ఆమె, ఆ తరువాత 'అగ్ని గుండం' సినిమాలో ఆయనకి అక్కయ్యగా నటించింది.
90వ దశకంలోకి వచ్చేసరికి 'బిగ్ బాస్' సినిమాలో చిరంజీవికి తల్లి పాత్రలో సుజాత మెప్పించింది. ఇలా ఒక హీరో కాంబినేషన్లో ఇన్ని రకాల పాత్రలలో మెప్పించడం చాలా కష్టం .. అలాంటి అవకాశం రావడం కూడా అరుదు.
అలాంటి ఓ క్రెడిట్ సుజాతకే దక్కింది. శ్రీదేవి .. జయసుధ .. జయప్రద హవా జోరుగా కొనసాగుతున్న సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటిగా సుజాత కనిపిస్తుంది. చీరకట్టులో .. సహజమైన నటనలో .. అందంగా నవ్వడంలో సుజాత తరువాతే ఎవరైనా అంటూ అప్పట్లోనే ఏఎన్నార్ .. శోభన్ బాబు ఆమెకి కితాబునివ్వడం విశేషం.