Begin typing your search above and press return to search.
ఆ కుర్రాడి సంగతేంటి ప్రభాస్?
By: Tupaki Desk | 17 Oct 2015 9:09 AM GMT24 ఏళ్ల వయసులో చాలామంది దర్శకుడవ్వాలన్న ఆశయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. కానీ సుజీత్ అనే కుర్రాడు ఆ వయసుకే దర్శకుడిగా మారడమే కాదు.. తొలి ప్రయత్నంలోనే ‘రన్ రాజా రన్’ లాంటి సూపర్ హిట్ మూవీ తీసి శభాష్ అనిపించుకున్నాడు. తొలి సినిమాతో హిట్టు కొట్టిన చాలామంది దర్శకుల్లాగే అతనూ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అయిపోయాడు. ఫోను ఆగకుండా మోగింది. చాలామంది నిర్మాతలు, హీరోలు లైన్లోకొచ్చారు. కానీ అతను మాత్రం నా ఫేవరెట్ హీరో ప్రభాస్ తోనే సినిమా చేస్తా.. నా తొలి సినిమాను నిర్మించిన ప్రభాస్ మిత్రులు వంశీ - ప్రమోద్ లకే ఇంకో సినిమా ఇస్తా.. అని భీష్మించుకు కూర్చున్నాడు.
ఏడాది కందటే స్క్రిప్టు రెడీ.. బడ్జెట్ తో నిర్మాతలు రెడీ.. కానీ హీరో సంగతే తేలలేదు. బాహుబలి-ది బిగినింగ్ షూటింగ్ అయిపోగానే ఫ్రీ అయిపోతా.. మళ్లీ రెండో పార్ట్ మొదలయ్యేలోపు షూటింగ్ పెట్టేసుకుందాం అన్నాడు ప్రభాస్. అనుకున్నట్లే ఫస్ట్ పార్ట్ ఆ షూటింగ్ అయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో రెండో పార్ట్ షూటింగ్ మొదలవబోతోంది. కానీ సుజీత్ సినిమా సంగతి మాత్రం తేలలేదు. బాహుబలి విడుదలకు ముందు ప్రమోషన్లతో, విడుదల తర్వాత రెండో పార్ట్ కోసం ప్రిపరేషన్స్ తో బిజీ అయిపోయాడు ప్రభాస్. మధ్యలో ప్రభాస్ కోసం ఎదురు చూసిన సుజీతే ఎటూ కాకుండా పోయాడు. తొలి సినిమాతో హిట్టు కొట్టిన ఏ దర్శకుడు కూడా ఇలా ఏడాది పాటు ఖాళీగా ఉన్నది లేదు. ప్రభాస్ ను నమ్ముకుని ఇంకో స్క్రిప్టు కూడా ఏదీ రాయకుండా.. ప్రభాస్ కు రాసిన కథను వేరొకరితో తీయడం ఇష్టం లేక అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు సుజీత్. ప్రభాస్ అయితే కనీసం ఇంకో ఏడాది దాకా ఖాళీ అయ్యే అవకాశాల్లేవు కాబట్టి.. ఇంకేదైనా ప్రాజెక్టు మీద దృష్టిపెట్టాల్సిందే సుజీత్. ఆ సంగతేదో ప్రభాసే చూసుకుంటే మంచిదేమో.