Begin typing your search above and press return to search.
ప్రభాస్-సుజీత్.. ఒక పేలిపోయే ఐడియా
By: Tupaki Desk | 28 Feb 2017 11:35 AM GMT‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా గురించి రెండేళ్ల కిందట్నుంచే చర్చ నడుస్తోంది. ప్రభాస్ ‘బాహుబలి’తో బిజీగా ఉన్నా సరే.. వేరే సినిమా చేసుకోకుండా అతడి కోసమే వెయిట్ చేశాడు సుజీత్. ఈ మధ్యే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఐతే మూడు భాషల్లో తెరకెక్కాల్సిన సినిమా. పైగా భారీ బడ్జెట్ మూవీ. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరణ జరపాల్సి ఉంది. అందుకే 2018లో కానీ ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం లేదని తేలిపోయింది. చిత్ర బృందం కూడా అదే ప్రకటన చేసింది. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలైనపుడు ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుందనడంలో సందేహం లేదు. మరి ఆ హైప్ ను ఈ సినిమా కోసం వాడుకోకుంటే ఎలా?
ఈ ఆలోచనతోనే యువి క్రియేషన్స్ వాళ్లు ఒక బంపర్ ఐడియాతో ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం భారీ లెవెల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ యాక్షన్ ఎపిసోడ్ ను మార్చి నెలలో చిత్రీకరించాలని భావిస్తున్నారట. ఆ సీక్వెన్స్ పూర్తి చేసి.. దాన్ని ఎడిట్ చేసి.. కొంత భాగాన్ని చిన్న టీజర్ రూపంలో ఏప్రిల్లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ‘బాహుబలి: ది కంక్లూజన్’తో పాటుగా దాన్ని థియేటర్లలోకి వదిలితే ఈ సినిమాకు తిరుగులేని హైప్ రావడం ఖాయం. అందుకే రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమయ్యేలా ఉన్నప్పటికీ ఈ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అవగొట్టేయాలని చిత్ర బృందం భావిస్తోంది. త్వరలోనే ఆ ఎపిసోడ్ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/