Begin typing your search above and press return to search.
ఆ కామెంట్లు చేయలేదంటున్న సుజిత్
By: Tupaki Desk | 9 Sep 2019 7:55 AM GMT'సాహో' రిలీజ్ కు ముందు నెలరోజుల నుండి మొదలైన హంగామా..'సాహో' విడుదలై దాదాపు పది రోజులు అవుతున్నా ఇంకా ఆగలేదు. బాక్సాఫీసు లెక్కల సంగతి పక్కన పెడితే 'సాహో' ఏదో ఒక అంశంలో చర్చనీయాంశం అవుతోంది. 'సాహో' కు ఆడియన్స్ రెస్పాన్స్ బాగానే ఉన్నా కొందరు కావాలని నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని.. అసలు ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ ను ప్రభాస్ కు ఇచ్చినందుకు బీహార్ లో ప్రేక్షకులు ముగ్ధులై ఒక గుడి కట్టేందుకు రెడీ అవుతున్నారని సుజిత్ అన్నట్టు రీసెంట్ గా మీడియాలో వచ్చింది.
ఈ విషయంపై సుజిత్ స్పందించినట్టుగా ఒక బాలీవుడ్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని.. అలాంటి కామెంట్స్ ఎప్పుడూ చేయనని సుజిత్ అన్నాడట. అంతే కాదు ఇలాంటి కామెంట్స్ ఎంత సిల్లీగా ఉంటాయో తనకు తెలుసని కూడా వ్యాఖ్యానించాడట. ఇక 'సాహో' సంబంధించి తనపై వస్తున్న తీవ్రమైన విమర్శల గురించి మాట్లాడుతూ "నేను ప్రభాస్ సర్.. నా నిర్మాతలు ఈ సినిమాను నమ్మి తెరకెక్కించడం జరిగింది. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చి సినిమాను చూడడం జరిగింది. అయినా నేనేదో పెద్ద నేరం చేసినట్టు నన్ను విమర్శిస్తున్నారు" అని వ్యాఖ్యానించాడట.
అంతే కాదు తను చివరిసారిగా 'సాహో' రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఇంటర్వ్యూలు ఇచ్చానని.. ఆ తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదని.. అయినా ఏదో ఒక కామెంట్లు చేసినట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయని వాపోయాడట. ఏదేమైనా ఈ విమర్శల హడావుడి తగ్గిన తర్వాత సుజిత్ ఒకసారి మీడియాతో ముచ్చటిస్తే ఈ రూమర్లన్నిటికీ అడ్డుకట్టపడుతుందేమో.