Begin typing your search above and press return to search.

శంక‌ర్ గారితో పోల్చ‌కండి ప్లీజ్!- సుజీత్

By:  Tupaki Desk   |   2 Aug 2019 2:08 PM GMT
శంక‌ర్ గారితో పోల్చ‌కండి ప్లీజ్!- సుజీత్
X
ప్ర‌భాస్- శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహో` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. స‌రిగ్గా నెల‌రోజుల స‌మ‌యం కూడా లేదు. అందుకే యూవి క్రియేష‌న్స్ సంస్థ ప్రచార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఆగ‌స్టు 2 మొద‌లు ఆగ‌స్టు 29 వ‌ర‌కూ ఊపిరి స‌ల‌ప‌ని షెడ్యూల్ ని ప్ర‌చారం కోసం ప్లాన్ చేశార‌ట‌. దేశంలోని అన్ని మెట్రో న‌గ‌రాల్ని చుట్టేస్తూ సునామీ స్పీడ్ తో ప్ర‌చార కార్య‌క్ర‌మాల్ని డిజైన్ చేశారు. తాజాగా నేడు `సాహో` చిత్రం నుంచి స్టైలిష్ సాంగ్ (ఏ చోట నువ్వున్నా..) ని రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ముచ్చ‌టించిన ద‌ర్శ‌కుడు సుజీత్ `సాహో` గురించి ప‌లు ఆస‌క్తిక‌ర సంగుతుల్న రివీల్ చేశాడు.

ఆస్ట్రియా లొకేష‌న్ల‌లో క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని అరుదైన‌ లొకేష‌న్ల‌లో `ఏ చోట నువ్వున్నా..` పాట‌ను చిత్రీక‌రించారు. ఈ సాంగ్ ఆద్యంతం మేకింగ్ స్టైల్ శంక‌ర్ సినిమాల్లోని భారీత‌నాన్ని ఎలివేట్ చేసింది. ఈ విజువ‌ల్స్ చూశాక‌.. ఇదే సంగ‌తిని మీడియా సుజీత్ ని ప్ర‌శ్నించింది. ఈ పాట మేకింగ్ శంక‌ర్ స్థాయిలో ఉంది క‌దా? ఆయ‌నే మీకు స్ఫూర్తినా? అన్న ప్ర‌శ్న‌కు సుజీత్ అంతే డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ తో స్పందించారు.

``వాళ్లు ఎక్క‌డో(ఎంతో ఎత్తున‌) ఉంటారు. శంక‌ర్ గారు పాటల్ని డీల్ చేసే విధానం వేరు. త‌న‌తో న‌న్ను పోల్చొద్దు`` అని సుజీత్ అన్నారు. శంక‌ర్ గారిలా సాంగ్ తీశారు అని కాల్స్ వ‌చ్చాయ‌ని వెల్ల‌డించారు. అందుకు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఇక ఈ సినిమాకి ఒక్కో పాట‌ను ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో కంపోజ్ చేయించ‌డానికి కార‌ణ‌మేంటి? అని ప్ర‌శ్నిస్తే.. దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు.

ఒకే సంగీత ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌కుండా ఇలా ప‌లువురితో ప‌ని చేయ‌డం అన్న‌ది ఇప్పుడే కాదు. ఎప్ప‌టి నుంచో ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత‌మందితో చేస్తే స‌మ‌స్య కానీ.. పాట‌ల వ‌ర‌కూ ప‌ని చేస్తే ఇబ్బందేమీ ఉండ‌దు అని సుజీత్ అన్నారు. సినిమాలో 3-4 పాటల ఉంటే ప్ర‌తి పాటా ఒకేలా ఉండ‌కూడ‌దు. అందుకే ఇంత‌మందితో ప‌ని చేయించాం. అయితే ఇలానే చేయాల‌ని ముందు అనుకోలేదు... అని తెలిపారు.