Begin typing your search above and press return to search.

జాకీతో ల‌వ్ లో ఉంటే నోరా అసూయ ప‌డేది!

By:  Tupaki Desk   |   22 Jan 2023 4:12 AM GMT
జాకీతో ల‌వ్ లో ఉంటే నోరా అసూయ ప‌డేది!
X
సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. 200 కోట్ల స్కామ్ క‌థ‌లో రొమాంటిక్ ల‌వ్ స్టోరీ ఔరా! అనిపిస్తోంది. ఇది క‌థానాయిక‌ల‌తో సుకేష్ ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ గుట్టును బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. త‌న‌ నుంచి బ‌హుమ‌తులు అందుకున్న ఇద్ద‌రు బాలీవుడ్ క‌థానాయిక‌ల‌తో సుకేష్ ప్రేమాయ‌ణం ఇప్పుడు మ‌తులు చెడ‌గొడుతోంది.

తాజా ఇన్వెస్టిగేష‌న్ లో సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ స్వ‌యంగా వెల్ల‌డించిన విష‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. తాజాగా కాన్ మాన్ సుకేష్‌ మీడియాకు ఒక ప్రకటనను షేర్ చేసాడు. అందులో అతడు నోరా ఫతేహి- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స‌హా ప‌లువురి గురించి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించాడు. వివ‌రాల్లోకి వెళితే..

సుకేష్ చంద్రశేఖర్ మీడియాతో తాజా ప్ర‌క‌ట‌న‌లో ఇద్ద‌రు భామ‌ల‌తో అంద‌మైన ప్రేమ‌ క‌థ‌ను బ‌హిర్గ‌తం చేసాడు. అందాల క‌థానాయిక‌ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై నోరా ఫతేహి అసూయపడిందని వెల్లడించాడు. ప్ర‌స్తుతం ఈ కేసులో ప్రమేయం ఉన్న అందాల క‌థానాయిక‌లు ఇద్దరినీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారిస్తోంది. సుకేష్ తన ప్రకటనలో నిక్కీ తంబోలి- చాహత్ ఖన్నా వంటి నటీమణుల గురించి కూడా మాట్లాడార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

అంతేకాదు..నోరా త‌న ప్రేయ‌సి జాక్వెలిన్ ను చూసి అసూయపడిందని సుకేష్ చెప్పారు. మీడియాతో సుకేష్‌ సుదీర్ఘ ప్రకటనలో ప‌లు ర‌హ‌స్యాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. నటీమణులిద్దరికీ అబద్దాలు చెప్పి తన వైపు మ‌లుచుకున్న‌ది నిజ‌మే అయినా.. నోరా ఫతేహి- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనపై మోపిన ఆరోపణలను సుకేష్ ఖండించారు. జాక్వెలిన్ ను చూసి నోరా అసూయపడుతుందని చెప్పాడు. తన లేఖలో సుకేష్ చంద్రశేఖర్ చాలా విష‌యాలు వెల్ల‌డించారు.

``నోరా ఎప్పుడూ జాక్వెలిన్ పై అసూయపడేది. జాక్వెలిన్ కు వ్యతిరేకంగా నన్ను ఎప్పుడూ బ్రెయిన్ వాష్ చేసేది. అలా చేయ‌డం ద్వారా నేను జాక్వెలిన్ ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ ప్రారంభించాలని కోరుకుంది. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. త‌న‌ కాల్ కి సమాధానం ఇవ్వక‌పోయినా కానీ త‌ను నాకు కాల్ చేస్తూనే ఉండేది`` అని తెలిపాడు.

నోరా తన నుండి బి.ఎమ్‌.డబ్ల్యూ ఎస్ సిరీస్ వంటి కొన్ని బహుమతులు తీసుకున్నట్లు సుకేష్ వెల్లడించాడు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ మోసగాడు సుకేష్ వివ‌రాల్ని అందించారు. ``నోరా తనకు కారు వద్దు అని చెప్పడం లేదా ఆమె దానిని తన కోసం తీసుకోలేదని చెప్ప‌డం చాలా పెద్ద అబద్ధం. ఎందుకంటే నా జీవితంలో ప్ర‌వేశించాక‌ ఆమె కారును మార్చవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె చాలా చౌక బారుగా కనిపించే `CLA`.. కాబట్టి.. ఆమె ఎంచుకున్న కారు ప్ర‌స్తుతం ఆమె వద్దనే ఉంది`` అని కూడా సుకేష్ వెల్ల‌డించారు. సుకేష్ తో నోరా చాట్ లు స్క్రీన్ షాట్ లు ED వ‌ద్ద‌ చాలా స్ప‌ష్ఠంగా లాక్ అయి ఉన్నాయి. కాబట్టి అస్సలు ఇందులో ఎలాంటి అబద్ధం లేదు.. నిజానికి నేను ఆమెకు రేంజ్ రోవర్ ఇవ్వాలనుకున్నాను. కానీ కారు స్టాక్ లో అందుబాటులో లేనందున ఆమె అత్యవసరంగా కావాల‌ని కోర‌డంతో నేను ఆమెకు BMW S సిరీస్ ని ఇచ్చాను. ఆమె చాలా కాలంగా ఆ కార్ ని వాడుతూనే ఉంది. ఆమె భారతీయురాలు కాదు కాబట్టి ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ భర్త బాబీ పేరు తో రిజిస్టర్ చేయమని నన్ను కోరింది. అయితే వృత్తిపరమైన లావాదేవీలు మా మ‌ధ్య‌ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఆమె నా సామాజిక సేవా సంస్థ (ఫౌండేషన్) హోస్ట్ చేసిన ఈవెంట్ కు ఒకసారి హాజరయ్యింది. దాని కోసం ఆమెకు ఏజెన్సీ పెద్ద మొత్తం చెల్లించింద‌``ని తెలిపారు.

త‌న ప్రేయ‌సి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ఈ సంద‌ర్భంగా మ‌రోసారి సుకేష్ చంద్రశేఖర్ మాట్లాడారు. జాక్వెలిన్ తో తనకు సీరియస్ రిలేషన్ షిప్ ఉందని అత‌డు వెల్లడించాడు. దాని కారణంగా అతను నోరా ఫతేహిని దూరం పెట్ట‌డం ప్రారంభించాడు. మ్యూజిక్ ప్రొడ‌క్ష‌న్ ఏర్పాటు చేయడంలో బాబీ (నోరా స్నేహితురాలి భర్త)కి సహాయం చేయమని `సాకీ సాకీ...` గాళ్ నోరా ఫ‌తేహి కాల్ చేసి తనను కోరడం తనకు చిరాకు పుట్టించేద‌ని అతను పేర్కొన్నాడు.

``నోరా ఎప్పుడూ తనకు కావాల్సిన హీర్మేస్ బ్యాగ్ లు ఆభరణాల ఫోటోలను నాకు పంపుతూనే ఉండేది. నేను ఆమెకు అలాంటివి ఇవ్వ‌డంలో వెన‌కాడ‌లేదు. ఆమె ఇప్పటివరకు వాటినే ఉపయోగిస్తోంది. ఆమె(నోరా) వద్ద ఉన్న హీర్మేస్ బ్యాగ్ ల బిల్లును చూపించ‌మ‌ని ఆమెను అడగండి. ఆమె వాటిని తాను కొనుక్కున్న‌ట్టుగా ఎప్పటికీ నిరూపించ‌లేదు. బ్యాగులు 2 కోట్ల కంటే ఎక్కువ విలువైనవి కాబట్టి వాటిని కొన‌డం త‌న వ‌ల్ల కాదు. ఆమె (నోరా) నాకు ఇల్లు కొనిస్తానని వాగ్దానం చేసింది. కానీ మొరాకోలోని కాసాబ్లాంకాలో తన కుటుంబానికి ఇల్లు కొనడానికి ఆమె ఇప్పటికే నా నుండి పెద్ద మొత్తం తీసుకుంది. 9 నెలల క్రితం ED ప్రకటన తర్వాత చట్టం నుండి తప్పించుకోవడానికి ఈ కొత్త కథలన్నీ అల్లుతోంది.. ఇవ‌న్నీ క్రియేట్ చేసిన‌వి`` అని సుదీర్ఘంగా ర‌హ‌స్యాల‌న్నిటినీ సుకేష్ వెల్ల‌డించారు.