Begin typing your search above and press return to search.

సుక్కు.. చిరుని మ‌రింత యంగ్ గా మార్చేశారే.. ఏంటీ క‌థ‌?

By:  Tupaki Desk   |   1 April 2022 6:30 AM GMT
సుక్కు.. చిరుని మ‌రింత యంగ్ గా మార్చేశారే.. ఏంటీ క‌థ‌?
X
స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌తిభ గురించి అంద‌రికి తెలిసిందే. ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని చాలా మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తుంటారు. కార‌ణం ఆయ‌న హీరో పాత్ర‌ని తెర‌పై ఆవిష్క‌రించే తీరు భిన్నంగా వుంటుంది కాబ‌ట్టి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న త‌న‌దైన మార్కు ఫార్ములాతో సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న వ‌ర్క్ చేసిన హీరోల‌ని కొత్త కోణంలో ఆవిష్క‌రించి వారికి ప్ర‌త్యేక గుర్తింపుని తీసుకొచ్చారు. బ‌న్నీని ఆర్య‌, ఆర్య 2, రీసెంట్ గా `పుష్ప‌` చిత్రాల‌తో ప్ర‌త్యేకంగా పోట్రేట్ చేసి త‌న‌ని ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మార్చారు.

'100 %' ల‌వ్‌'తో నాగ‌చైత‌న్య‌ని, వ‌న్ నేనొక్క‌డినే` చిత్రంతో మ‌హేష్ ని, నాన్న‌కు ప్రేమ‌తో చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని, `రంగ‌స్థ‌లం`తో రామ్ చ‌ర‌ణ్ ని స‌రికొత్త పంథాలో ఆవిష్క‌రించి హీరోలుగా వీరికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని తెచ్చిపెట్టారు. ఇటీవ‌ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన `పుష్ప‌` సుకుమార్ కెరీర్ నే మార్చేసింది. అంతే కాకుండా బ‌న్నీని పాన్ ఇండియా స్టార్ గా మార్చింది.

ద‌క్షిణాదిలో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ ఉత్త‌రాదిలో 100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త చ‌రిత్ర‌కు నాందిప‌లికింది.

ఈ మూవీ సాధించిన వ‌సూళ్లు ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. ఓ ప్రాంతీయ సినిమా నేష‌న‌ల్ వైడ్ గా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిందంటే ఆ ఘ‌న‌త బ‌న్నీతో పాటు సుకుమార్ దే అన‌డంతో ఎలాంటి సందేహం లేదు. హీరోల‌ని ప్ర‌త్యేకంగా చూపించే సుకుమార్ తాజాగా మెగాస్టార్ చిరంజీవిని మ‌రింత యంగ్ గా చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

దీనికి సంబంధించిన ఫొటోల‌ని మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. వివ‌రాల్లోకి వెళితే.. ఓ రియ‌ల్ ఎస్టేట్ కు సంబంధించిన యాడ్ ఫిల్మ్ ని తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించారు. ఈ యాడ్ ఫిల్మ్ కోసం తొలిసారి సుకుమార్ డైరెక్ష‌న్ లో మెగాస్టార్ చిరంజీవి న‌టించారు. ఫార్మ‌ల్ డ్రెస్ లో చిరు అచ్చం కాలేజీ స్టూడెంట్ లా ఈ యాడ్ లో క‌నిపిస్తున్నారు.

ఆయ‌న వ‌య‌సు చాలా వ‌రకు త‌గ్గిపోయిందా? మ‌ళ్లీ యంగ్ హీరో అయిపోతున్నారా? అనేంత‌గా చిరు లుక్ అంద‌రిని షాక్ కు గురిచేస్తోంది. తాజా యాడ్ కి సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకున్న మెగాస్టార్ `ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ప్ర‌తిభ అంద‌రికి తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం వారి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాను. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను` అని ట్వీట్ చేశారు. చిరంజీవి న‌టించిన `ఆచార్య‌` ఏప్రిల్ 28న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి కొన్ని చిత్రాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి.