Begin typing your search above and press return to search.

అప్పట్లో పూరి దగ్గర అసిస్టెంటుగా చేరాలనుకున్న సుకుమార్!

By:  Tupaki Desk   |   24 Aug 2022 8:36 AM GMT
అప్పట్లో పూరి దగ్గర అసిస్టెంటుగా చేరాలనుకున్న సుకుమార్!
X
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' రూపొందింది. బాక్సింగ్ వేపథ్యంలో నడిచే ఈ సినిమాకి పూరితో పాటు చార్మీ .. కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. బాక్సర్ గా విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాలో ఆయన తల్లి పాత్రలో రమ్యకృష్ణ .. లవర్ పాత్రలో అనన్య పాండే కనిపించనున్నారు. మైక్ టైసన్ అతిథి పాత్రలో మెరవనున్నారు. ప్రపంచవ్యాప్తంగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి పూరిని సుకుమార్ ఇంటర్వ్యూ చేయడం విశేషం.

ముందుగా సుకుమార్ .. పూరితో ట్లాడుతూ, "సార్ .. మీకు గుర్తుందో లేదో .. 'బద్రి' సినిమా తరువాత నేను మీ దగ్గరకి వచ్చాను. అప్పట్లో ఆ సినిమా సూపర్ .. డూపర్ హిట్. సినిమాల్లోకి రావాలనుకుంటున్న నాకు ఆ సినిమా భలేగా నచ్చేసింది.

దాంతో మా దగ్గర బంధువుల్లో ఒకాయనకి మీరు బాగా తెలుసంటే, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలనే ఆసక్తితో ఆయన వెంట మీ దగ్గరికి వచ్చాను. అమీర్ పేట్ లోని ఒక కాఫీ హోటల్లో మిమ్మల్ని కలిశాను. 'కథ ఏదైనా రాసుకొచ్చావా?' అంటూ నాతో మీరు మాట్లాడారు.

ఇక మీ సినిమాల్లో నాకు 'ఇడియట్' అంటే చాలా ఇష్టం. అప్పటివరకూ వచ్చిన లవ్ స్టోరీస్ కి భిన్నంగా ఆ సినిమా చేశారు. ఆ సినిమాలోని చాలా సీన్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఆ తరహా సీన్స్ ఆ సినిమాతోనే మొదలయ్యాయి.

ఎంటర్టైన్ మెంట్ విషయంలో ఎక్కడ ఏ మాత్రం గ్యాప్ లేకుండా భలే కొత్తగా తీశారే అనుకున్నాను. ఎప్పటికైనా పూరీలా ఒక సినిమా చేయాలని ఆ సినిమా చూసిన తరువాతనే నేను అనుకున్నాను. అంతగా ఆ సినిమా నన్ను ప్రభావితం చేసింది. నేను నా సినిమా చేయడానికి చాలా టెన్షన్ పడుతుంటాను .. కానీ మీలో ఆ టెన్షన్ అస్సలు కనపడదు" అంటూ సుకుమార్ నవ్వేశాడు.

అందుకు పూరి స్పందిస్తూ .. "మొదటి నుంచి కూడా నేను అంతే. కథ ఏదైనా దాని విషయంలో నాకు పూర్తి క్లారిటీ ఉంటుంది. కథ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు కనుకనే, నేను టెన్షన్ పడను. ఏ సినిమా అయినా ఉదయం  9 గంటల  నుంచి సాయంత్రం 6 గంటల వరకే  చేస్తాను. ఆ తరువాత సమయం నా కోసం  కేటాయించుకుంటాను. ఆ సమయంలో మళ్లీ సినిమాను గురించి మాట్లాడను. ఇక సాధ్యమైనంత వరకూ నైట్ సీన్లు రాయను. ఖర్చు పరంగా నిర్మాతలను .. సమయం పరంగా ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టను" అంటూ చెప్పుకొచ్చాడు.