Begin typing your search above and press return to search.
కల్యాణ్ గారికి కథ చెబుతామని వెళ్లానుగానీ కుదర్లేరు: సుకుమార్
By: Tupaki Desk | 10 Jun 2022 3:50 AM GMTమైత్రీ మూవీ మేకర్స్ వారితో సుకుమార్ కి మంచి అనుబంధం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే వాళ్ల బ్యానర్లో నిర్మితమైన 'అంటే .. సుందరానికీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ వచ్చారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. " ఈ సినిమాను మా నిర్మాతలు సరదాగా చూడమని అంటే చూశాను. వివేక్ ఆత్రేయ కూడా అక్కడే ఉన్నాడు. డైరెక్టర్ గా నా కంటూ ఒక ఈగో ఉంటుంది కదా. అందువలన ఫస్టాఫ్ చూసిన తరువాత ఏదో కుర్రాడు బాగానే తీశాడులే అనుకున్నాను.
సెకండాఫ్ చూడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి నా ఈగో బరస్ట్ అయిపోయింది. అంత ఆనందాన్నీ .. ఎంజాయ్ మెంట్ ను నేను తట్టుకోలేకపోయాను. బయటికి వచ్చిన తరువాత ఆత్రేయను గట్టిగా హగ్ చేసుకున్నాను. ఫస్టాఫ్ చూసినప్పుడు నేను హార్ట్ ఫుల్ గా చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను .. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది.
నానీ విషయానికి వస్తే ఆయన ఒక నటన అనే ఆకాశం. నవరసాలను అద్భుతంగా పలికించగలిగే సహజ నటుడు నాని. ఇక నజ్రియా విషయానికి వస్తే 'పుష్ప' సినిమా సమయంలో నా గురించి ముందుగానే వాళ్లయనకి ఒక మంచి మాట చెప్పింది.
సుకుమార్ గారు వస్తున్నారు .. ఆయన సినిమా చేయనని అనకండి అని వాళ్లయనకి ముందుగానే చెప్పేసి ఉంచారు. నజ్రియాకి తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనే విషయం ఆమెకి తెలియదేమో.
నాని .. నజ్రియా తెరపై నటించినట్టుగా అనిపించలేదు .. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా చాలా ముచ్చటగా కనిపించారు. ఈ సినిమా నిర్మాతల ప్లానింగ్ .. వాళ్ల జడ్జిమెంట్ చాలా కరెక్టుగా ఉంటాయి. మొన్నకూడా మాటల్లో బన్నీ అదే మాట అన్నాడు.
కల్యాణ్ గారిని నేను 'ఆర్య' తరువాత కలిశాను. ఆయనకి కథ చెప్పడానికి వెళ్లి కూడా చెప్పలేకపోయాను. ఆ తరువాత 'భీమ్లా నాయక్' షూటింగు దగ్గరికి నేను వెళ్లినప్పుడు, నేను కాస్త ఆయాస పడుతున్నట్టుగా కల్యాణ్ గారు గ్రహించి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండమని త్రివిక్రమ్ తో చెప్పించారు. నేను ఆయాస పడింది ఆయనను చూశాననే ఆనందంతో. ఆ తరువాత యోగా చేయడం మొదలు పెట్టాను ఇప్పుడు బాగానే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.