Begin typing your search above and press return to search.
సెకండ్ పార్ట్ లోనే అసలైన మజా ఉందన్నాడు
By: Tupaki Desk | 19 Dec 2021 4:50 AM GMTఅల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లోని పుష్ప -ది రైజ్ ఇటీవలే విడుదలై మాస్ ఆడియెన్ ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై క్రిటిక్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సెకండాఫ్ లో ల్యాగ్ సన్నివేశాలపైనా విస్త్రతంగా చర్చ సాగింది. అయితే తప్పంతా ఎక్కడ జరిగింది? అంటూ సుకుమార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో ఎంతో ఆశించిన ఫహద్ ఫాజిల్ - అనసూయ పాత్రలు ఆడియెన్ ని పూర్తిగా సంతృప్తి పరచలేదు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యకరం.
నిజానికి మొదటి భాగం రెండో భాగానికి లీడ్ మాత్రమే! ఇందులో పాత్రల్ని పరిచయం చేసామంతే. రెండో భాగంలో ఆ పాత్రలన్నీ ఎలివేట్ అవుతాయి. అసలు మజా రెండో భాగంలోనే ఉంటుంది. మొదటి పార్ట్ లో కొన్ని సన్నివేశాలు డ్రాగ్ అవ్వడానికి కారణం ఉందని సుకుమార్ అన్నారు. పుష్ప - ది రైజ్ ద్వితీయార్థంలో ఎక్కువగా పాత్రకు లీడ్ తీసుకోవడం వల్లనే ల్యాగ్ కనిపించిందని సుకుమార్ అన్నారు. ``పుష్ప అసలు కథ పార్ట్-2లోనే ఉంది. పార్ట్-1 అసలు ఇతివృత్తానికి ఒక లీడ్ మాత్రమే. పార్ట్ 2 మరో లెవల్లో ఉంటుంది. మీరు సమర్థించని అన్ని పాత్రలు పార్ట్ లో మరో రేంజులో ఉంటాయి. సెకండ్ పార్ట్ లో మరో మూడు పాత్రల్ని అదనంగా చేరుస్తున్నాం`` అని తెలిపారు.
పార్ట్ 2లో ఫహద్ ఫాజిల్ పూర్తి స్థాయి పెర్ఫార్మెన్స్ చూస్తారని తెలిపారు. అనసూయ పాత్రతో పాటు ఇతరులకు సెకండ్ పార్ట్ లోనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సుకుమార్ అన్నారు. ఫిబ్రవరిలో పార్ట్ 2 సెట్స్‌పైకి వెళుతుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సాగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది డిసెంబర్ లేదా ఇంకా ముందే విడుదల చేస్తామని సుక్కూ తెలిపారు.
అయితే బాహుబలి ని రెండు భాగాలుగా కథను మార్చాలనుకున్నప్పుడు ఇలాంటి సమస్య రాజమౌళికి తలెత్తలేదు. బాహుబలి -1 పై కొన్ని విమర్శలు వచ్చినా తీవ్రంగా విరుచుకుపడలేదు. ఆ సినిమా పెద్ద సక్సెసైంది. బాహుబలి-2 అయితే సంచలనాలు సృష్టిస్తూ భారతీయ సినీపరిశ్రమలోనే అరుదైన రికార్డుల్ని క్రియేట్ చేసింది. అలాంటి ఫీట్ వేరొక దర్శకుడికి సాధ్యపడలేదన్న టాక్ ఇప్పటికీ ఉంది. అటు ఉత్తరాదినా అగ్ర దర్శకులకు ఇది ఒక ఫజిల్ లానే ఉంది.