Begin typing your search above and press return to search.

విరూపాక్ష.. వావ్ అనేసిన సుకుమార్..!

By:  Tupaki Desk   |   26 April 2023 2:00 PM GMT
విరూపాక్ష.. వావ్ అనేసిన సుకుమార్..!
X
సాయి ధరం తేజ్ హీరోగా కార్తీక్ దండు డైరెక్షన్ లో వచ్చిన సినిమా విరూపాక్ష. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు సుకుమార్. సుక్కు కథ అంటే సినిమా రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. అనుకున్నట్టుగానే చాలా రోజుల తర్వాత తెలుగు ఆడియన్స్ కు ఒక పర్ఫెక్ట్ హారర్ మూవీ ఎక్స్ పీరియన్స్ అందించారు. విరూపాక్ష సినిమాలో అన్ని విభాగాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి అందుకే సినిమాకు మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ కొనసాగుతుంది. ఇప్పటికే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి కూడా వచ్చేసింది.

సినిమాకు స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఒక నిర్మాతగా కూడా ఉన్నారు సుకుమార్. విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.

ఇక ఫైనల్ గా ప్రేక్షకుల నుంచి సినిమాకు ఆమోద ముద్ర రావడంతో విరూపాక్ష సినిమాపై తన కామెంట్స్ మరోసారి వెళ్లడించారు సుకుమార్. సినిమా జస్ట్ వావ్ అనేస్తున్నారు సుకుమార్. కార్తీక్ కథ చెప్పినప్పటి కన్నా విజువల్స్ పరంగా చాలా అద్భుతంగా తీశావని అన్నారు.

సాయి ధరం తేజ్ హార్డ్ టైం లో కూడా సినిమాకు ది బెస్ట్ అందించావు.. సం యుక్త అద్భుతమైన ప్రదర్శన.. సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ, అజనీష్ మ్యూజిక్ హైలెట్ అని అన్నారు.

ఈ సినిమా విజయంలో భాగమైన అందరికి కంగ్రాట్స్ అంటూ తన సోషల్ మీడియాలో కామెంట్ చేశారు సుకుమార్. ఇక ఈ సినిమాతో మరోసారి సుకుమార్ బ్రాండ్ ఏంటన్నది ప్రూవ్ అయ్యింది. సుకుమార్ సపోర్ట్ తో ఏ సినిమా వచ్చినా అది రికార్డులు సృష్టిస్తుందని ఫిక్స్ అయ్యారు.

ఇక సుకుమార్ చేస్తున్న పుష్ప 2 విషయానికి వస్తే పుష్ప 1 జస్ట్ శాంపిల్ మాత్రమే పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. పుష్ప 2 అనుకున్న విధంగా సక్సెస్ అయితే రాజమౌళి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన డైరెక్టర్ గా సుకుమార్ పేరు మారు మోగుతుంది.