Begin typing your search above and press return to search.

బన్నీ - సుక్కు ఫోకస్ మొత్తం వాటి మీదే..!

By:  Tupaki Desk   |   3 Dec 2020 4:30 AM GMT
బన్నీ - సుక్కు ఫోకస్ మొత్తం వాటి మీదే..!
X
దర్శకుడు సుకుమార్‌ - అల్లు అర్జున్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. కరోనా లాక్ డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి దట్టమైన అభయారణ్యంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ వేసిన సెట్స్ లో దాదాపు మూడు నెలలు షూట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారట. ఈ షెడ్యూల్ లో సుకుమార్ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ మరియు క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నాడట. కాకపోతే మధ్యలో ఓ 15 రోజులు మాత్రం తమిళనాడు లోని టెన్ కాశీలో షూటింగ్ చేస్తారని సమాచారం. వింటర్ సీజన్ లో చ‌లికి త‌ట్టుకోలేక‌నే కొంత షెడ్యూల్ అక్క‌డ ప్లాన్ చేసిన‌ట్లుగా టాక్ నడుస్తోంది. టెన్ కాశీ షెడ్యూల్ జ‌న‌వ‌రిలో మొద‌ల‌వ్వ‌బోతుందని తెలుస్తోంది. ఏదేమైనా సుక్కు - బన్నీ పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్స్ మీదనే ఫోకస్ పెట్టారని అర్థం అవుతోంది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అలానే చిత్తూరు యాసలో మాట్లాడే మొరటు కుర్రాడిగా బన్నీ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే 'పుష్ప' నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 'పుష్ప' వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.