Begin typing your search above and press return to search.
దేవీ నుంచి పిండగలిగే ఒకే ఒక్కడు
By: Tupaki Desk | 11 Dec 2019 1:30 AM GMTదర్శకుడితో సంగీత దర్శకుడి సింక్ కుదరకపోతే ఇక ఆ సినిమాకి బడితెపూజ ఖాయమైనట్టే. ఓ పట్టాన ట్యూన్ క్రియేటివ్ గా పుట్టదు. ఇక ఆ ఫ్రస్టేషన్ లో దర్శకహీరోలు సహకరించకపోతే ఇంకేదో అవుతుంది. గత కొన్నేళ్లుగా దేవీశ్రీ ప్రసాద్ తనని ఎవరు నమ్మారో .. ఎవరు సతాయించలేదో వాళ్లకు మాత్రమే అద్భుతమైన సంగీతం అందించాడని అర్థమవుతోంది. ప్రతి సినిమాకి ఒకేలా పని చేసినా.. దేవీ శ్రీ ట్యూన్లు ఇటీవల రొటీన్ గా మారాయి. ఇప్పటికే విమర్శలు పీక్స్ లో ఉన్నాయి అతడిపై. ఆర్య.. ఆర్య2.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. బొమ్మరిల్లు ఇవన్నీ దేవీశ్రీ క్లాసిక్ మ్యూజిక్ వల్ల మరో లెవల్ కి వెళ్లాయి. కానీ ఇటీవల చాలా సినిమాలకు దేవీశ్రీ రొటీన్ ట్యూన్స్ ఇచ్చాడు.
ఎంసీఏ-హలో గురూ ప్రేమ కోసమే-మహర్షి ఆడియోలు దేవీ రేంజులో లేవన్న విమర్శలు వచ్చాయి. తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు పరిస్థితి అంతకుమించి గొప్పగా ఏం లేదు. ఈ సినిమాకి సంబంధించి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజైతే రెండిటికీ విమర్శలు తప్పలేదు. ట్యూన్స్ రొటీన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పలేదు. కారణం ఏదైనా దేవీ మూస ధోరణిలో పడిపోయాడని అర్థమవుతోంది. ఇక ఇప్పటికే త్రివిక్రమ్.. కొరటాల లాంటి దర్శకులు దేవీని దూరం పెట్టేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇలాంటి టైమ్ లో సుకుమార్ మాత్రమే అతడికి అవకాశం ఇచ్చాడు. ఇక ఆర్య.. ఆర్య2 తర్వాత ఈ కాంబినేషన్ నుంచి మళ్లీ ఆ రేంజులో ట్యూన్స్ ఆశిస్తారు అభిమానులు. మరోసారి అలా ఇవ్వాలంటే దేవీలో క్రియేటివిటీ మరో లెవల్ కి చేరాలి. అందుకోసం సుక్కూ అతడిని ఫుల్ గానే పిండేస్తున్నాడట. ఒక్కో ట్యూన్ కోసం 50 శాంపిల్స్ తీసుకుంటున్నాడన్న మాటా వినిపిస్తోంది. ఐదారు నెలలుగా ఈ బృందం కేవలం రెండే ట్యూన్స్ ఖాయం చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుక్కూ ఆ లెవల్లోనే దేవీని పిండేస్తున్నాడని భావించవచ్చు. బన్నికి మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని దేవీ నుంచి తీసుకుని తీరతాడని అర్థమవుతోంది.