Begin typing your search above and press return to search.

వర్మ కోసం సుక్కూ అండ్ రాజమౌళి?

By:  Tupaki Desk   |   26 May 2018 6:15 AM GMT
వర్మ కోసం సుక్కూ అండ్ రాజమౌళి?
X
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలకు సంబందించిన ప్రమోషన్స్ ఏ విధంగా చేస్తాడో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆఫీసర్ సినిమా ప్రమోషన్స్ స్థాయిని కూడా అలానే పెంచాలని చూస్తూన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. వర్మ సినిమాలను ఇష్టపడే వారికి సైతం ఈ సారి ఆఫీసర్ సినిమా ఎంత వరకు రుచిస్తుందా లేదా అనేది సందేహమే. ఒక్క నాగార్జున ఉన్నారు అనే పాజిటివ్ టాక్ తప్ప సినిమాకు పెద్ద బజ్ లేదు.

సినిమా ట్రైలర్ సాంగ్స్ యావరేజ్ గానే ఉన్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. వర్మ సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ సినిమా ప్రమోషన్స్ ని పెంచాలని అనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ వివాదంతో కాస్త దూరమయినా ఇప్పుడు దర్శకుల నుంచి పాజిటివ్ క్రేజ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు సుకుమార్ ని వర్మ స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించాడట. ఈ సోమవారం సినిమా ఈవెంట్ ని ప్లాన్ చేశారు.

జూన్ 1న సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ తో పాటు రాజమౌళి కూడా సినిమా ఈవెంట్ లో పాల్గొంటారట. ఎలాగూ నాగార్జునకు అందరు చాలా క్లోజే కాబట్టి వచ్చే అవకాశం ఉంది. ఇక అక్కినేని సన్నిహితులు కూడా ఈ సినిమా వేడుకలో పాల్గొని స్పెషల్ బజ్ క్రియేట్ చెయ్యాలని అనుకుంటున్నారు. మరి వర్మ వేసిన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.