Begin typing your search above and press return to search.
సుకుమార్ శిష్యుడు శవమయ్యాడు
By: Tupaki Desk | 23 Aug 2016 4:24 AM GMTటాలీవుడ్లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంటుగా పని చేసిన విక్రమ్ చైతన్య హఠాత్తుగా చనిపోయాడు. అతడి మృతికి సంబంధించి మిస్టరీ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. సుకుమార్ దగ్గర 1 నేనొక్కడినే.. నాన్నకు ప్రేమతో సినిమాలకు పని చేసిన విక్రమ్ చైతన్య కూకట్ పల్లిలోని రెయిన్ బో విస్తాస్ అపార్ట్ మెంట్ రెండో ఫ్లోర్ నుంచి కిందికి పడి చనిపోయాడు. అతడిది ఆత్మహత్యా.. ప్రమాదమా.. లేక ఎవరైనా కిందికి తోసి చంపేశారా అన్నది తెలియడం లేదు. ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకోగా.. విషయం బయటికి పొక్కేసరికి ఆలస్యమైంది.
పోలీసులు విక్రమ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం అంత్యక్రియలు జరుతాయని సమాచారం. సుకుమార్ దగ్గర పని చేస్తాడంటే విక్రమ్ చైతన్య టాలెంటెడే అయి ఉంటాయి. అతను ఇంత చిన్న వయసులో ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులు.. స్నేహితులకు పెద్ద షాకే. విక్రమ్ ఈ నెల 8వ తారీఖునే తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆ వేడుకల్లో సుకుమార్ కూడా పాల్గొన్నాడు. అల్లు అర్జున్ తో సుకుమార్ తీసిన షార్ట్ ఫిలిం ‘ఐయామ్ దట్ చేంజ్’లో విక్రమ్ కానిస్టేబుల్ గా చిన్న పాత్ర పోషించాడు. నాన్నకు ప్రేమతో సినిమాకు అడిషనల్ డైలాగ్స్.. స్క్రీన్ ప్లే క్రెడిట్స్ లో కూడా విక్రమ్ పేరుంటుంది. తన శిష్యులు ఒక్కక్కరికే తన సొంత బేనర్లో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్న సుక్కు.. విక్రమ్ ను కూడా దర్శకుడిని చేసేవాడేమో. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.