Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు సుక్కు ఎలా షాకిచ్చాడు?
By: Tupaki Desk | 26 Jan 2016 10:30 PM GMTదర్శకుడు కట్ అంటాడు హీరో రిలాక్స్ అయిపోతాడు. కెమెరా లేనపుడు క్యాజువల్ గా ఏదేదో చేసేస్తాడు. మరి అలాంటి మూమెంట్ ను క్యాప్చర్ చేసి సినిమాలో వాడేస్తే..? అది సినిమాలో పర్ఫెక్టుగా సింక్ అయిపోతే..? దాన్ని హీరో తెరమీద చూసుకుని షాకైపోతే..? నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో ఇలాగే జరిగిందట. ఎన్టీఆర్ కు తెలియకుండా అతడి హావభావాల్ని క్యాప్చర్ చేసి సినిమాలో వాడేశాడట సుక్కు. సినిమాలో జగపతి బాబు.. ఎన్టీఆర్ అండ్ గ్యాంగ్ మాటల్ని సీక్రెట్ మైక్ ద్వారా వింటుంటాడు గుర్తుందా? ఆ సీన్ చివర్లో లైట్ పడితే పెయింటింగ్ ఎలివేట్ అవుతుందని కూడా తెలియదేంట్రా వీడికి అని తాగుబోతు రమేష్ డైలాగ్ వేస్తాడు. అది విని జగపతి పెయింటింగ్ తనవైపు మారుస్తాడు. పెయింటిగ్ మారిందని అర్థమవ్వగానే ఎన్టీఆర్ తో పాటు అతడి గ్యాంగంతా ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది. ఐతే ఆ ఎక్స్ ప్రెషన్లన్నీ నటించినవి కావట.
సీన్ అయిపోయిందంటూ కట్ చెప్పేసిన సుకుమార్.. కెమెరామన్ కు మాత్రం షూట్ చేస్తూ చేస్తూనే ఉండమని ముందే హింట్ ఇచ్చాడట. సీన్ అయిపోయిందని రిలాక్స్ అయిపోయిన ఎన్టీఆర్ - తాగుబోతు రమేష్.. వీళ్లందరూ ఫన్నీ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారట. కెమెరా ముందైతే నేచురల్ గా చేయరేమో అని చెప్పి ఇలా చేశాడట సుక్కు. నిజానికి ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ నుంచి క్యాజువల్ స్మైల్ ఆశించాడట సుక్కు. కెమెరామన్ షూట్ చేసేశాక.. ఎన్టీఆర్ ఏదో ఒక చోట నవ్వి ఉంటాడు చూడమని చెప్పి, దాన్ని క్యాప్చర్ చేసి సినిమాలో వాడేశాడట. ఐతే డబ్బింగ్ సందర్భంగా ఎన్టీఆర్ ఈ సీన్ చూసి షాకయ్యాడట. నేనెప్పుడు కెమెరా ముందు ఇలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చానని ఆశ్చర్యపోయాడట. సుక్కు అప్పుడు అసలు సంగతి వెల్లడించాడట. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ సీక్రెట్ బయటపెట్టారు ఇద్దరూ.