Begin typing your search above and press return to search.

సుక్కు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు

By:  Tupaki Desk   |   3 March 2019 12:44 PM GMT
సుక్కు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు
X
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మహర్షి తర్వాత ఏ సినిమా చేస్తాడనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎఫ్2 తో ఇండస్ట్రీ హిట్ తన జేబులో వెసుకున్న అనిల్ రావిపూడి చెప్పిన లైన్ బాగా నచ్చడంతో మహేష్ అతనికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అందుకే స్క్రిప్ట్ తో కుస్తీ పడుతున్న సుకుమార్ ప్రాజెక్ట్ దాని తర్వాత మొదలుపెట్టే ఆలోచన చేసినట్టు చాలా ప్రచారమే జరిగింది. సుకుమార్ మీడియా ముందుకు ఈ మధ్య కాలంలో రాలేదు కాబట్టి క్లారిటీ తీసుకునే అవకాశం లేకపోయింది.

అయితే సుక్కుకు బాగా సన్నిహితంగా ఉండే కొందరి ద్వారా ఎంక్వయిరీ చేస్తే మహేష్ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ స్టేజి లో ఉందని మహర్షి రిలీజయ్యాక ఇదే మొదలవుతుందని ఖచ్చితంగా చెబుతున్నాడట. వీలైతే మే లేదా మహా అంటే జూన్ లో స్టార్ట్ చేయడం ఖాయమని చెబుతున్నట్టు తెలిసింది. మహేష్ సుక్కులు కలిసి చెబితే కాని దీనికి సంబంధించి క్లారిటీ రాదు. కాని మహర్షి రిలీజయ్యే దాకా ప్రిన్స్ కొత్త కబుర్లు చెప్పడు గాక చెప్పడు.

ఇటు సుక్కు కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. అనిల్ రావిపూడి బయట కనిపించడం మానేసాడు. సీరియస్ గా మహేష్ కోసం కథను స్క్రిప్ట్ గా మార్చే పనిలో బిజీగా ఉన్నట్టు ఫ్రెండ్స్ అంటున్నారు. పోనీ దీని నిర్మాత అయినా బయట పడతారేమో అనుకుంటే అదీ తెలియదు. మహేష్ ఫ్యాన్స్ మాత్రం ముందు మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తాం తర్వాత సుక్కుతోనా అనిల్ తోనా అనే చర్చలోకి దిగుతాం అంటున్నారు. సో ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు