Begin typing your search above and press return to search.
మహేష్ పుష్ప కు నో... నిజమే కాని నిజం కాదు
By: Tupaki Desk | 19 Dec 2021 4:31 AM GMTరామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకుంది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే సుకుమార్ తో సినిమాను చేసేందుకు మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించాడు. ఇద్దరి మద్య చర్చలు జరిగాయి.. ఇద్దరు కూడా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సినిమా కోసం దాదాపు ఏడాది పాటు జర్నీ సాగిన తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయడం లేదు అంటూ సుకుమార్ ప్రకటించాడు. కొన్ని సృజనాత్మక విభేదాల కారణాలతో తాము సినిమాలు చేయలేదు అని ఇద్దరు కూడా ప్రకటించారు. సుకుమార్ మరియు మహేష్ బాబు కాంబో సినిమా అన్నప్పుడే మీడియాలో అడవి నేపథ్యంలో సినిమా అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
కనుక అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ను చేసిన సుకుమార్ మొదట ఈ కథను మహేష్ బాబుకు చెప్పాడు అంటూ అంతా ఒక నమ్మకంకు వచ్చారు. మహేష్ బాబు మరియు సుకుమార్ ల కాంబోలో పుష్ప సినిమా రావాల్సి ఉండే. కాని కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయ్యింది అనేది మొన్నటి వరకు జరిగిన టాక్. ఇప్పుడు పుష్ప సినిమా విడుదల అయ్యి థియేటర్లలో ఉంది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు అనేది మీడియా వర్గాల టాక్. లాంగ్ రన్ లో సినిమా ఫలితం ఏంటీ అనేది క్లారిటీ వస్తుంది. ఈ సమయంలో మళ్లీ పుష్ప సినిమా కథను మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు అయ్యింది.
పుష్ప ను మహేష్ బాబు చేయక పోవడం మంచిది అయ్యిందని కొందరు అంటూ ఉంటే.. అయినా ఇలాంటి ఒక కథను.. అలాంటి ఒక పాత్రను మహేష్ బాబుతో చేయాలని సుకుమార్ ఎలా అనుకున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబును పుష్ప పాత్రలో చూసి ఉంటే బాబోయ్ తట్టుకోలేక పోయేవాళ్లం.. కనుక అంతా మంచే జరిగింది అని కొందరు అనేస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు పుష్ప మరియు మహేష్ బాబు ను కలిపి కామెంట్స్ చేస్తున్న సమయంలో దర్శకుడు సుకుమార్ స్పందించాడు.
అసలు పుష్ప కథ ను మహేష్ బాబు వద్దకు తీసుకు వెళ్లారా అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆయన చెబుతున్న దాని ప్రకారం పుష్ప సినిమా కథను మహేష్ బాబు వద్దకు మొదట తీసుకు వెళ్లడం జరిగింది. ఆ కథ ఆయన విన్న మాట వాస్తవం.. దాంతో సినిమా చేయాలనుకున్న మాట కూడా వాస్తవం. కాని ఇప్పుడు పుష్ప సినిమా గా వచ్చిన కథకు మహేష్ బాబు కు చెప్పిన కథకు చాలా తేడా ఉంది. స్టోరీ లైన్ కాన్సెప్ట్ సేమ్ అయ్యి ఉండవచ్చు కాని కథ మాత్రం చాలా మారింది అన్నట్లుగా సుకుమార్ చెప్పుకొచ్చాడు.
మహేష్ బాబుతో పుష్ప కథను చేయాలి అనుకున్న మాట వాస్తవమే కాని.. పుష్ప కథ ఇది వేరు అన్నట్లుగా సుకుమార్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. నిజమే కాని నిజం కాదు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఆయన ఏది ఏమన్నా కూడా పుష్ప కథ మొదట మహేష్ బాబు వద్దకు వెళ్లింది. మహేష్ బాబు టీమ్ సూచించిన మార్పులకు సుకుమార్ నో చెప్పి ఉంటారు.. అందుకే సినిమా పట్టాలెక్కలేదు. మళ్లీ సినిమా కథను బన్నీ స్టైల్ కు మార్చి కొత్తగా రాసుకుని ఉంటారు. అలా పుష్ప బన్నీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా బన్నీకి కెరీర్ బెస్ట్ యాక్టింగ్ స్కిల్స్ చూపించే అవకాశం దక్కింది.