Begin typing your search above and press return to search.
నిజంగా పుష్పకు అంత సీన్ ఉందా అనుకున్నా..!
By: Tupaki Desk | 30 Dec 2021 9:59 AM GMTఅల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప కు పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఉత్తరాదిన ఈ సినిమా వీక్ ఓపెనింగ్స్ ను రాబట్టడంతో బన్నీ పరువు అక్కడ పోవడం ఖాయం అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ ప్రచారం మొదలు పెట్టారు. కాని సినిమాకు మెల్ల మెల్లగా పాజిటివ్ రెస్పాన్స్ ప్రచారం జరగడంతో లాంగ్ రన్ లో అక్కడ 50 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అవ్వబోతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరాది నుండి ఈ స్థాయి వసూళ్లు ఎవరు ఊహించలేదట. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమా తెలుగు లో బాగా ఆడుతుంది.. కేరళలో బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఆడుతుంది కాని ఇతర ప్రాంతాల్లో ఆడుద్ది అనే నమ్మకం పెట్టుకోలేదట.
సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో ఇదో పాన్ ఇండియా సినిమా ఉద్దేశ్యం సుకుమార్ ఎప్పుడు పెట్టుకోలేదట. బన్నీ మరియు నిర్మాతల నిర్ణయం మేరకే సినిమా హిందీ మరియు ఇతర భాషల్లో డబ్ అయ్యిందట. సినిమా విడుదల ముందు నేపాల్ కు ప్రింట్ లు పంపించడం చూసి నవ్వుకున్నాడట. అక్కడ ఈ సినిమా విడుదల చేయడం ఏంటీ అక్కడ ఎవడు చూస్తాడ్రా బాబు అనుకున్నాడట. బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ సినిమా అసలు షో లు పడే పరిస్థితి ఉంటుందా అని కూడా భావించాడట. కాని అక్కడ నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి సుకుమార్ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాడట. పుష్ప సౌత్ లోనే అన్ని రాష్ట్రాల్లో మంచి వసూళ్లను దక్కించుకోలేదు అనుకున్న సుకుమార్ ఉత్తరాది నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి షాక్ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
సినిమా చిత్రీకరణ సమయం నుండే నిర్మాతలు మరియు బన్నీ కలిసి పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేసి అన్ని భాషల్లో పోస్టర్ లను విడుదల చేశారు. కాని దర్శకుడు సుకుమార్ మాత్రం పుష్ప కు నిజంగా అంత సీన్ ఉత్తరాదిన ఉంటుందా అనే అనుమానంగా ఉండే వారట. కాని బన్నీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీగా వసూళ్లను రాబట్టడంతో సుకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చాడు. బన్నీ కి ఈ స్థాయిలో ఉత్తరాదిన క్రేజ్ ఉన్నట్లుగా తాను భావించలేదు అన్నాడు. పుష్ప సినిమాకు అన్ని చోట్ల నుండి వస్తున్న రెస్పాన్స్ కు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. పుష్ప 2 ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప కు వచ్చిన రెస్పాన్స్ ను చూసిన దర్శకుడు సుకుమార్ ఈసారి మరింతగా శ్రద్ద పెట్టి పాన్ ఇండియా రేంజ్ మూవీని చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
పుష్ప మొదటి పార్ట్ ను తెరకెక్కించే సమయంలో నిర్మాతలు మరియు బన్నీ మాత్రమే పాన్ ఇండియా దృష్టి పెట్టారు. కాని సుకుమార్ కు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా కు అంత సీన్ లేదనే అభిప్రాయంతో ఉన్నాడు. కనుక సినిమా ను సాదారణంగానే ఆయన తెరకెక్కించి ఉంటాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2 కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆయనకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతో మరింత శ్రద్ద పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నుండి పుష్ప 2 ను పట్టాలెక్కించబోతున్నట్లుగా ప్రకటించారు. బన్నీ సెకండ్ పార్ట్ లో ఎలా ఉండబోతున్నాడు అనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఇక సునీల్ పాత్ర సెకండ్ పార్ట్ లో కనిపించబోతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సెకండ్ పార్ట్ లో ఫాహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతుందని మొదటి నుండి చెబుతున్నారు.