Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కు లోపం.. సుక్కు ఏం చేస్తాడు?

By:  Tupaki Desk   |   3 Nov 2019 5:14 AM GMT
అల్లు అర్జున్ కు లోపం.. సుక్కు ఏం చేస్తాడు?
X
ఓ మొక్కకు అంటుకట్టినట్టు.. ఓ గోడకట్టినట్టు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ సినిమాలు ఉంటాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. సుకుమార్ లాజిక్ అంత త్వరగా ప్రేక్షకులకు అర్థం కాదు అని కూడా అంటారు. ఈ లెక్కల మాస్టర్ సినిమాలు ప్రతీదీ పక్కా లెక్కతో ఉంటుంది. హీరోకు ఖచ్చితంగా ఓ మేనరిజం ఉంటుంది.

అయితే సుకుమార్ తీసిన సినిమాలన్నింటిని గమనిస్తే హీరోకు ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంటుంది. ఆయన తొలి చిత్రం ‘ఆర్య’ నుంచి మొదలుపెడితే మొన్నటి రంగస్థలం వరకూ హీరో సైకలాజికల్ గా కొంచెం వీక్ గా.. లేదా ఏదో ఒక లోపంతో కనిపిస్తాడు. సుకుమార్ కథలు రాసుకున్నప్పుడే అలా హీరోలను డిజైన్ చేస్తాడా? లేక యథాలపంగా అలా వీక్ గా వచ్చేస్తాయో తెలియదు కానీ.. హీరోలు మాత్రం ఏదో ఒక మానసిక - శారీరక సమస్యతో బాధపడుతుంటారు..

ఆర్యా1 చిత్రంలో ఫీల్ మై లవ్ అంటూ చిన్నపిల్లాడిలా హీరోయిన్ వెంటపడే అల్లు అర్జున్ ను చూపించాడు సుకుమార్. ఆ తర్వాత ఆర్యా2లో అల్లు అర్జున్ ను కొంచెం హైపర్ ఉన్న సైకో యువకుడిలా మార్చేశాడు. ఇక మహేష్ తో తీసిన 1 నేనొక్కిడినే చిత్రంలో కూడా మహేష్ ను మానసిక సంఘర్షణతో గుర్తుకురాని ఓ హీరోగా మలిచాడు. మొన్నటికి మొన్న ‘రంగస్థలం’లో హీరో రాంచరణ్ ను చెవిటివాడిగా చూపించాడు.

ఇలా సుకుమార్ చిత్రంలో హీరోలు ఏదో ఒక లోపంతో కనిపించడం ఖాయంగా వస్తోంది. ఇప్పుడు మరోసారి హ్యాట్రిక్ గా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ వస్తోంది. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ కు కూడా ఏదో ఒక లోపం పెడుతారా? ఆర్యా1 - 2 చిత్రాల్లో సైకో మెంటాల్టీలో బన్నీని చూపించిన సుకుమార్ ఈసారి ఎలాంటి ప్రయోగం చేస్తాడన్నది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.