Begin typing your search above and press return to search.
ఉప్పెనకు కటింగ్ చేస్తున్న.. క్రియేటివ్ డైరెక్టర్!
By: Tupaki Desk | 23 May 2020 8:50 AM GMTస్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతూ ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాడు. 'ఉప్పెన' పేరుతో నిర్మితమైన ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో వైష్ణవ్ తేజ్ పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ కృతి శెట్టి అరంగేట్రం చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చుచేశారట నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమాలో హీరో, హీరోయిన్, దర్శకుడు అంతా కొత్తవాళ్లే కావడంతో, నిర్మాతలు చెప్పిన రేటుకి ఈ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఉప్పెన’ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఉప్పెన రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందిస్తూ నిర్మాణంలో కూడా భాగమయ్యాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా లాక్‌డౌన్ ముగియగానే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. కానీ లాక్ డౌన్ ఇంకా ముగియలేదు. ఈ కారణంగా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే సూచనలు కూడా లేవని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సమయంలో ఉప్పెన సినిమాకు కత్తెర వేసే పనిలో పడ్డాడు సుకుమార్. ఈ సినిమా రన్‌టైమ్‌ను రెండున్నర గంటలకంటే తక్కువ ఉండేలా చూసేందుకు పలు సన్నివేశాలను ఆయన తొలగిస్తున్నాడట. ఈ సినిమాను బుచ్చిబాబు తీయడంతో అతడికి అదిరిపోయే డెబ్యూని ఇచ్చేందుకు సుక్కు తనవంతు సాయం చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కన్పించనున్నాడు.