Begin typing your search above and press return to search.
సుకుమార్ రైటింగ్స్ లో కుమారి వస్తోంది
By: Tupaki Desk | 2 Sep 2015 5:49 PM GMTస్టార్ డైరెక్టర్ సుకుమార్ తన శిష్యుడు పల్నాటి ప్రతాప్ ని దర్శకుడి గా పరిచయం చేస్తూ స్వీయనిర్మాణం లో తెరకెక్కించిన సినిమా 'కుమారి 21 ఎఫ్'. సుకుమార్ రైటింగ్స్ పతాకం పై సుకుమార్ సమర్పిస్తున్న చిత్రమిది. లేటెస్టు గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ డిజైన్ ఎంత సింపుల్ గా ఉందో అంత బ్యూటి ఫుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. టైటిల్ కి యూత్ లో విపరీతమైన క్రేజు వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ సాగుతోంది. దసరా బరి లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్.
ఈ చిత్రం లో నటిస్తున్న హీరో రాజ్ తరుణ్ ఇప్పటికే 'సినిమా చూపిస్త మావ' చిత్రంతో సక్సెస్ అందుకుని మాంచి ఊపుమీదున్నాడు. చూస్తుంటే రాజ్ తరుణ్ రవితేజ తర్వాత రవితేజ అంత ఎదిగేట్టే కనిపిస్తున్నాడు. అతడి ఫ్రీ స్టయిల్ యాక్టింగ్ అందరికీ నచ్చుతోంది. సుకుమార్ అంతటివాడి పర్యవేక్షణ, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు కెమెరా పనితనం వెరసి ఇవన్నీ రాజ్ తరుణ్ కి కలిసొచ్చేట్టే కనిపిస్తోంది. మరో హిట్ కొట్టేట్టే ఉన్నాడు.
ముఖ్యంగా ఈ చిత్రానికి సుకుమార్ కథ, కథనం, మాటలు అందించాడు. కాబట్టి అదే సినిమాకి ప్రధాన బలం. 100పర్సంట్ లవ్ తరహాలో ఈ సినిమా కూడా హిట్టెక్కితే రాజ్ తరుణ్ కి నాగ చైతన్యకి వచ్చినంత క్రేజొచ్చేస్తుంది. అదీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.