Begin typing your search above and press return to search.

సుక్కుకి సమంతతో సమస్యా?

By:  Tupaki Desk   |   28 Sep 2017 5:48 AM GMT
సుక్కుకి సమంతతో సమస్యా?
X
రామ్ చరణ్ ఈ మధ్య సినిమాల విషయంలో చాలా అలర్ట్ గా ఉంటున్నాడు. మాస్ సినిమాలతో హిట్స్ వస్తున్నా.. తన రేంజ్ ను పెంచడం లేదనే పాయింట్ ని గ్రహించిన చెర్రీ.. ధృవ నుంచి రూట్ మార్చేశాడు. సురేందర్ రెడ్డితో చేసిన ధృవ అన్ సీజన్ లో వచ్చి కూడా అన్ ఎక్స్ పెక్టెడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఆ తర్వాత సుకుమార్ సినిమాలో తన గెటప్ కోసమే నాలుగు నెలలకు పైగా సమయం కేటాయించి షూటింగ్ మొదలుపెట్టాడు రామ్ చరణ్.

రంగస్థలం 1985 అనే టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత నటిస్తోంది. సినిమా షూటింగ్ కూడా శరవేగంగానే జరుగుతోంది. కానీ అక్టోబర్ 6న.. అంటే సరిగ్గా వారంలో రోజుల్లో సమంత పెళ్లి చేసుకోబోతోంది. అక్కినేని నాగచైతన్య-సమంతల వివాహం అక్టోబర్ 6న గోవాలో జరగనుంది. అంటే ఇప్పుడు అన్ని సినిమాలకు బ్రేక్ పడిపోవడం ఖాయమే. అదే ఇప్పుడు సుకుమార్ సినిమా పూర్తి కావడానికి అడ్డంకి కానుందనే టాక్ ఒకటి స్ప్రెడ్ అయింది. అయితే.. ఈ విషయంలో దర్శకుడి నుంచి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సమంత మ్యారేజ్ డేట్ ఇప్పటికిప్పుడు ఫిక్స్ అయినదేమీ కాదు. రెండు నెలలకు ముందే ఈ డేట్ అనౌన్స్ చేశారు.

అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేసుకుని.. సమంత షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసేశామని చెప్పేశాడు సుకుమార్. ఆమెకు సంబంధించిన వర్క్ అంతా పూర్తయిపోయిందని తెలిపాడు. అంతే కాదు.. ఓ భూత్ బంగ్లాకు సంబంధించిన సీన్ కోసం మళ్లీ షూట్ చేయాల్సిన అవసరం వస్తుందనే ఆలోచనతో.. 3 రోజుల కాల్షీట్స్ అదనంగా కూడా తీసుకున్నామని చెప్పాడు సుకుమార్. అవసరం అయితే పెళ్లి తర్వాత షూట్ లో పాల్గొనేందుకు సమంత అంగీకరించిందట. అదీ సంగతి.. చెర్రీ సినిమాకి సమంత పెళ్లి ఏ మాత్రం అడ్డంకి కాదు. ఏతావాతా ఇంకేదైనా లేట్ జరిగితే.. అది సుక్కు-చెర్రీల చేతిలోనే ఉంటుంది.