Begin typing your search above and press return to search.
'పుష్ప -2' కు టైమ్ ఫిక్స్ చేసిన సుకుమార్
By: Tupaki Desk | 21 Feb 2022 9:30 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సంచలన చిత్రం `పుష్ప`. సుకుమార్ - బన్నీల కలయికలో రూపొందిన మూడవ చిత్రం కాడంతో ఈ మూవీ ప్రారంభం నుంచి వార్తల్లో నిలిచింది. వెంపల్లి గంగాధర్ రాసిన `ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు` కథ ఆధారంగా ఈ చిత్రాన్ని చేస్తున్నారంటూ సదరు రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ సినిమా వార్తల్లో నిలిచింది. అంతే కాకుండా అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించని విధంగా ఊర మాస్ పాత్రలో సినిమా లో ఎక్కువ భాగం లుంగీలో కనిపించిన తీరు కూడా సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
అయితే ముందు ఈ చిత్రాన్ని ఒకే భాగం అని మొదలుపెట్టిన సుకుమార్ ఆ తరువాత కథ డిమాండ్ మేరకు రెండు భాగాలుగా విడదీసి ముందు ఫస్ట్ పార్ట్ గా `పుష్ప ది రైజ్`ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించిన దేశ వ్యాప్తంగా రికార్డులు సృస్టించింది. కంటెంట్ పరంగా, మేనరిజమ్స్ పరంగా, పాటల పరంగా వరల్డ్ వైడ్ గా వైరల్ గా మారిన ఈ మూవీ ఏకంగా 300 కోట్లకు పైచిలుకు వసూళ్లని రాబట్టి ట్రేడ్ పండితుల్ని విస్మయానికి గురిచేసింది.
ఉత్తరాదిలో ఏకంగా ఈ మూవీ వంద కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా ఉత్తరాది మార్కెట్ లో వంద కోట్లని రాబట్టడంతో నార్త్ ఆడియన్స్ ని మరింతగా ఎట్రాక్ట్ చేయాలని సుకుమార్ పుష్ప పార్ట్ 2 విషయంలో తన ప్లాన్ ని మార్చుకున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందు అనుకున్న కథకు మరింతగా మాసీవ్ యాక్షన్ ఘట్టాలని జోడించి పార్ట్ 2ని మరింత కొత్తగా మలచాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.
మరి కొంత మంది బాలీవుడ్ క్రేజీ స్టార్ లని కూడా రంగంలోకి దింపాలని కథలో మార్పులు చేస్తున్న సుకుమార్ ఈ పార్ట్ 2 ని సమ్మర్ లో పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందు అనుకున్న కథ ప్రకారం అయితే ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించాలి. కానీ కథలో అనూహ్యంగా మార్పులకు శ్రీకారం చుట్టడంతో స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తి కాలేదని ఆకారణంగానే పార్ట్ 2 షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వస్తోందని తెలుస్తోంది.
సమ్మర్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాలనుకుంటున్నారట. దీని కారణంగా బోయపాటి శ్రీను - అల్లు అర్జున్ ల ప్రాజెక్ట్ మరింత వెనక్కి వెళ్లనుందని చెబుతున్నారు. `సరైనోడు` హిట్ తరవాత మరోసారి బోయపాటి శ్రీను - బన్నీ కలిసి ఓ భారీ మూవీ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇది `పుష్ప - 2` కారణంగా మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
దీంతో బోయపాటి ఆ సమయాన్ని రామ్ చిత్రానికి కేటాయించాలని నిర్ణయించుకున్నారని, ఆ కారణంగానే రామ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు.