Begin typing your search above and press return to search.
'పుష్ప' లో సుక్కూ ఫోకస్ మొత్తం వాటి మీదనే..!
By: Tupaki Desk | 17 Jun 2021 4:30 AM GMTఅల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ 'పుష్ప'. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ వాటిని మరింత రెట్టింపు చేసింది. బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా రగ్గ్ డ్ లుక్ లో ఊర మాస్ గా కనిపించి అదరగొట్టాడు. ఇందులో యాక్షన్ మేజర్ రోల్ ప్లే చేయబోతున్నట్లు టీజర్ లోనే హింట్ ఇచ్చారు.
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి సుకుమార్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తగ్గట్లుగా స్టోరీని విభజించిన డైరెక్టర్.. యాక్షన్ మరియు ఎలివేషన్ సీన్స్ కు పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ తో హై ఆక్టేన్ యాక్షన్ బ్లాక్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అది రాత్రి సమయంలో జరిగే బోట్ ఫైట్ అని టాక్ నడుస్తోంది. భారీగా ఖర్చు చేసి తీసిన ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
పుష్ప టీజర్ లో శాంపిల్ చూపించిన సుక్కూ.. ఊర మాస్ బన్నీ ని పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది. 'కేజీఎఫ్' మాదిరిగా ఎలివేషన్ సీన్స్ - భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల సుకుమార్ శిష్యుడు, 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు ఈ విషయంపై హింట్ ఇచ్చాడు. 'పుష్ప' మొదటి భాగం పది 'కేజీఎఫ్' లతో సమానమని చెప్పడం దీనిపై అంచనాలు పెంచేసింది. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అర్థం అవుతోంది.
'పుష్ప 1' చిత్రానికి సంబంధించి ఇప్పటికే 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. జూన్ నెలాఖరున తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలసి నిర్మిస్తున్నాయి.