Begin typing your search above and press return to search.
పూరి ఫెయిలైన చోట 'దర్శకుడు' కొట్టాలి
By: Tupaki Desk | 3 Aug 2017 5:30 PM GMTసినిమాలను తీసే సినిమా ఇండస్ర్టీపై ఎన్ని సినిమాలు వచ్చినా కూడా.. అవన్నీ పెద్దగా హిట్టవ్వలేదు. ఏదో 'ఖడ్గం' వంటి సినిమాలో కాస్త పార్టును సినిమా ఇండస్ర్టీపై ఫోకస్ చేయించి.. దానిని కామెడీకి వాడేసుకుంటే.. అప్పుడు మాత్రమే వర్కవుట్ అయ్యింది. అంతేకాని పూర్తి స్థాయిలో పూరి జగన్ వంటి డైరక్టర్లు 'నేనింతే' అంటూ తీస్తే మాత్రం బెడసి కొట్టింది. హిందీలో కూడా సినిమా ఇండస్ర్టీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ పెద్దగా ఆడలేదు. ఫ్యాంటసీ కథతో వచ్చిన 'ఓం శాంతి ఓం' ఎక్కినా.. ఒక అసిస్టెంట్ డైరక్టర్ అండ్ ఆర్ట్ డిజైనర్ కథతో వచ్చిన 'ఐ హేట్ లవ్ స్టోరీస్' వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయ్.
ఇప్పుడు తెలుగులో మరోసారి సినిమా ఫీల్డు నేపథ్యంలో ఒక సినిమా వస్తోంది. ''దర్శకుడు'' అనే పేరుతో ఒక దర్శకుడు అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రేమ కథతో సినిమా వచ్చేస్తోంది. సుకుమార్ ప్రొడక్షన్లో హరిప్రసాద్ డైరక్షన్లో అశోక్ బండ్రెడ్డి హీరోగా వస్తున్న ఈ సినిమాతో ఇప్పుడు పూరి జగన్ వంటి దర్శకుడు ఫెయిలైన చోటనే హిట్టు కొట్టాల్సి పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ సినిమాలో సుకుమార్ తరహాలో లాజిక్కులూ ఎమోషన్లూ ఉంటూ.. సినిమా ఇండస్ర్టీ బ్యాక్ డ్రాప్ కంటే కథపై ఎక్కువగా గ్రిప్ ఉంటే మాత్రం సినిమా తప్పకుండా ఆడుతుంది. పెద్ద పెద్ద హేమాహేమీలు ప్రమోట్ చేసిన దర్శకుడు సినిమాలో అవన్నీ పుష్కలంగానే ఉన్నాయంటున్నాడు సుకుమార్. ఈ సినిమా ఫేట్ ఏంటనేది రేపు తెలుస్తుందిలే.