Begin typing your search above and press return to search.
నాన్నకు ప్రేమతో 3 నెలలు.. కుమారి ఏడాది
By: Tupaki Desk | 30 Jan 2016 11:30 AM GMT‘నాన్నకు ప్రేమతో’ ఎంత కాంప్లికేటెడ్ స్క్రిప్టో సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ అర్థమైంది. అలాంటి సినిమాకు స్క్రిప్టు రాయడానికి సుకుమార్ చాలా టైమే తీసుకుని ఉంటాడని అనుకుంటాం. కానీ ఆ స్క్రిప్టు కేవలం మూడు నెలల్లో పూర్తి చేసేశాడట సుకుమార్. మరోవైపు సింపుల్ గా కనిపించే ‘కుమారి 21 ఎఫ్’ స్క్రిప్టు రెడీ చేయడానికి మాత్రం ఏడాది పట్టిందట. తన కెరీర్లోనే ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే అని కూడా చెబుతున్నాడు సుక్కు. కుమారి 21 ఎఫ్.. ‘లైలా సేస్’ అనే ఫ్రెంచ్ మూవీకి కాపీ అనే ఆరోపణల మీద వివరణ ఇస్తూ ఈ విషయం వెల్లడించాడు సుక్కు.
‘‘కుమారి 21 ఎఫ్ స్టోరీ ఐడియా నాది. ఇంటర్వెల్లో హీరోయిన్ హీరోనుద్దేశించి ‘మెచ్యూరిటీ ఉందా’ అని అడుగుతుంది. ఈ సినిమా థీమ్ ఆ డైలాగ్ లోనే ఉంది. దాన్ని బేస్ చేసుకునే ఆ కథ రాశా. హీరో క్యారెక్టరైజేషన్ అంతా కొత్తగా ఉంటుంది. అది నా సృష్టి. నిజానికి ఈ సినిమాకు నేను రాసిన క్లైమాక్స్ కూడా వేరు. ఐతే ‘లైలా సేస్’ మూవీ క్లైమాక్స్ నచ్చి దాని స్ఫూర్తితో వేరే రాశాను. క్లైమాక్స్ వరకు ‘లైలా సేస్’ నుంచి స్ఫూర్తి పొందిన మాట వాస్తవం. మిగతా స్క్రిప్టంతా నా ఆలోచనల ఆధారంగానే రాశాను. ‘కుమారి 21 ఎఫ్’ స్క్రీన్ ప్లే ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నింటిలో ది బెస్ట్. ఈ స్క్రిప్టు మీద నేను ఏడాది పాటు పని చేశాను. కానీ ‘నాన్నకు ప్రేమతో’ స్క్రిప్టు మాత్రం మూడు నెలల్లో పూర్తయిపోయింది’’ అని సుక్కు తెలిపాడు.