Begin typing your search above and press return to search.
సుక్కు.. అసలు రౌడితో ఉంటుందా?
By: Tupaki Desk | 15 Jan 2023 2:30 AM GMTస్టార్ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప సిరీస్ లో భాగంగా పార్ట్ 2ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తుంది. మొదటి భాగం కంటే మరింత పవర్ ఫుల్ గా ఈ పార్ట్ 2 ని సుక్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి పుష్ప భాగా రీచ్ అయిన నేపధ్యంలో ఇందులో అంశాలు, హీరో, విలన్స్ మధ్య సన్నివేశాలు మరింత గ్రాండియర్ గా ఆవిష్కరించాలని భావిస్తున్నాడు. అయితే ఈ సారి మాత్రం పుష్పలో మెజారిటీ షూటింగ్ ని ఫారిన్ లో చేయడానికి సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఏది ఏమైనా ఈ పార్ట్ 2 మీద మాత్రం ప్రస్తుతం ఈ లెక్కల మాష్టారు గట్టిగానే ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉంటే పుష్ప షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ తో ఒక యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించినట్లు ఓ సందర్భంలో సుకుమార్ తెలిపాడు. అయితే రామ్ చరణ్ తో చేయబోయే నెక్స్ట్ సినిమా కోసమే దానిని సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
మైత్రీ మూవీ మేకర్స్ లోనే సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే నెక్స్ట్ సినిమా ఉంటుంది. అందుకే ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్ ని ముందుగానే రామ్ చరణ్ తో సుకుమార్ చేసాడని టాక్. అయితే పుష్ప సిరీస్ లో భాగంగా పార్ట్ 3 కోసం రామ్ చరణ్ ని రంగంలోకి దించడానికి సుక్కు ప్లాన్ చేస్తున్నాడని, అందుకోసమే ముందుగా అ షూట్ చేసాడనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే సుకుమార్ లైన్ లో విజయ్ దేవరకొండ సినిమా కూడా ఉందనే సంగతి అందరికి తెలిసిందే.
లైగర్ డిజాస్టర్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే మాట వినిపిస్తున్న అలాంటిదేం లేదని క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో మొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు.
అలాగే ఇప్పటి వరకు వచ్చిన కథలకి భిన్నంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ మరో వైపు రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యింది. ఈ నేపధ్యంలో సుకుమార్ విజయ్ దేవరకొండ ముందుగా రామ్ చరణ్ తోనే సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.