Begin typing your search above and press return to search.
నాన్న గురించి సుకుమార్
By: Tupaki Desk | 22 Jan 2016 5:30 PM GMTతన తండ్రి చివరి ఘడియల సందర్భంగా వచ్చిన ఎమోషన్లోంచి పుట్టిన కథే ‘నాన్నకు ప్రేమతో’ అని ఇంతకుముందే చెప్పాడు సుకుమార్. ఐతే ‘నాన్నకు ప్రేమతో’ రివెంజ్ స్టోరీ కదా.. మరి సుక్కు తండ్రి మరణానికి దీనికి ఏంటి సంబంధం అన్న అనుమానం వచ్చింది అందరికీ. ఐతే ఈ కథతో తన తండ్రి జీవితానికి ఏం సంబంధం లేదని.. ఈ కథ రాయడానికి దారితీసిన కారణం వేరని చెప్పాడు సుక్కు. ఆ సంగతేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘మా నాన్న మొదట్నుంచి పల్లెటూల్లోనే జీవించారు. ఆయన్ని విదేశాలకు తీసుకెళ్లాలనే కోరిక ఉండేది. ఆధ్యాత్మిక కేంద్రం కాశీకైనా తీసుకెళ్లాలని అనుకునేవాణ్ని. కానీ ఆ పనులేవే చేయలేకపోయాను. డబ్బున్నా తీరిక లేక ఆ పనులు చేయలేకపోయా. సినిమాల్లో బిజీగా ఉండటం.. ఒక సినిమా పూర్తయితే ఇంకో సినిమా గురించి ఆలోచించడం.. సక్సెస్ - ఫెయిల్యూర్స్ కు సంబంధించిన టెన్షన్స్.. ఇలాగే జీవితం గడిచిపోయింది. కుటుంబానికి సరిగా సమయం కేటాయించలేకపోయాను. అలా మా నాన్నగారు కోరుకున్న వాటిని నెరవేర్చలేకపోయాననే బాధ కలిగింది ఆయన చనిపోతున్నపుడు. అప్పుడే ‘నాన్నకు ప్రేమతో’ కథకు బీజం పడింది. ఐతే మా నాన్న కోరికలు తీర్చకపోయినా మా అమ్మ కోరుకున్నవన్నీ చేసి తీరాలని అనుకుంటున్నాను. ఆ నమ్మకం నాకుంది’’ అని చెప్పాడు సుక్కు.