Begin typing your search above and press return to search.

‘నాన్నకు ప్రేమతో..’కి ‘డిగ్రీ’కి లింకేంటి?

By:  Tupaki Desk   |   15 Jan 2016 6:29 AM GMT
‘నాన్నకు ప్రేమతో..’కి ‘డిగ్రీ’కి లింకేంటి?
X
మైండ్ గేమ్ సినిమాలు తీసే విషయంలో దర్శకుడు సుకుమార్ తర్వాతే ఎవరైనా. తెలుగు సినిమాను చూసేందుకు కాస్త మైండ్ పెట్టాలి అన్న భావన కల్పించిన అతగాడిని పొగిడేసే వాళ్లు ఎందరో.. విమర్శించే వారు ఎందరో. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా నాన్నకు ప్రేమతో.. బాగుంది కానీ.. మాస్ కు ఎక్కటం అంత ఈజీ కాదు సుమి అన్న మాట అందరి నోటా వినిపించటం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమాను వంక పెట్టే ఛాన్స్ లేకున్నా.. విమర్శించకుండా మాత్రం ఉండలేకపోవటమే ఇప్పుడసలు విషయంగా మారింది. ఎన్టీఆర్ తాజా సినిమాను క్లాస్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే.. మాస్ కి మాత్రం ఓ పట్టాన ఎక్కేలా లేకపోవటంపై పలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయ్.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అత్యధిక భాగం మాసే. ఆ విషయంలో మరో మాట లేదు. అలాంటి మాస్ కు నాన్నకు ప్రేమతో సినిమా అర్థం కావాలంటే.. కష్టపడాల్సిందే. అందుకే.. నాన్నకు ప్రేమతో చూడాలంటే.. మినిమం డిగ్రీ కావాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా చూసేందుకు డిగ్రీ అర్హత తప్పనిసరి అన్నట్లుగా సుకుమార్ తన తాజా చిత్రంలో ‘లాజిక్’ లతొ చంపేశాడన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఈ తరహా స్పందన సినిమా సక్సెస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో జూనియర్ డైహార్ట్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం రుచించటం లేదు. సినిమా మరీ క్లాస్ గా ఉందని.. మాస్ ను ఆకర్షించేలా సుకుమార్ జాగ్రత్త తీసుకోలేదని మండిపడుతున్నారు. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నా.. మాస్ మనసుల్ని కొల్లగొట్టటంలో విఫలమైందన్న మాట నాన్నకు ప్రేమతో సినిమాకు కాస్త మైనస్ గా మారిందని చెప్పక తప్పదు.