Begin typing your search above and press return to search.
సుకుమార్ చిన్న సినిమా ముచ్చట్లు
By: Tupaki Desk | 5 Sep 2018 6:26 AM GMTస్టార్ డైరెక్టర్ సుకుమార్ నుంచి అప్పుడప్పుడూ చిన్న సినిమాలు కూడా వస్తుంటాయి. ఇంతకుముందు తన శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రానికి స్క్రిప్టు అందించడంతో పాటు తనే ఆ చిత్రాన్ని నిర్మించాడు కూడా. ఆ తర్వాత తన మిత్రుడు హరిప్రసాద్ జక్కాను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘దర్శకుడు’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ‘కుమారి 21 ఎఫ్’ లాగా ఇది హిట్టవలేదు. అలాగని సుకుమార్ ఇలాంటి ప్రయత్నాలు ఆపేయడం లేదు. త్వరలోనే సుక్కు ప్రొడక్షన్లో మరో సినిమా రాబోతోంది. అతడితో ‘రంగస్థలం’ తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ఇందులో భాగస్వామి కాబోతోంది. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చి బాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
ఈ చిత్రం కోసం కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. 18-24 ఏళ్ల మధ్య వయసున్న తెలుగమ్మాయిని కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్న చిత్ర బృందం అందుకోసం ప్రకటన ఇచ్చింది. వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీనికి కథ అందిస్తున్నది సుకుమారే. విశేషం ఏంటంటే ఈ చిత్రంతోనే సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం కానున్నాడట. వైష్ణవ్ ను హీరోగా పరిచయం చేయడానికి మైత్రీ వాళ్లు చాన్నాళ్ల కిందటే ఫిక్సయ్యారు. అప్పట్నుంచి కథలు వింటున్నారు. ఒక దశలో అవసరాల శ్రీనివాస్ తో సినిమా చేయడానికి చర్చలు జరిగాయి. కానీ అది వర్కవుట్ కాలేదు. చివరికి తమ సంస్థకు ఆస్థాన దర్శకుడిలా మారిన సుకుమార్ తో మాట్లాడి అతడి శిష్యుడి సినిమాతో వైష్ణవ్ ను హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి.