Begin typing your search above and press return to search.
వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టబోతున్న స్టైలిష్ డైరెక్టర్...?
By: Tupaki Desk | 23 July 2020 5:30 PM GMTప్రస్తుతం వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ సిరీస్ చూసావా.. ఈ సిరీస్ చూసావా.. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు రాబోతోంది.. అంటూ చర్చించుకుంటునున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా అందరూ వెబ్ సిరీస్ లని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కూడా వీటి హవా ఇలానే కొనసాగే అవకాశముంది. దీంతో భవిష్యత్ లో వెబ్ కంటెంట్ దే రాజ్యం కాబోతోందని భావించిన నటీనటులు దర్శక నిర్మాతలు వెబ్ వరల్డ్ లో అడుగు పెడుతున్నారు. వెబ్ సిరీస్ లు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో చాలా వెబ్ సిరీస్ లు ప్రముఖ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో నందిని రెడ్డి - సంకల్ప్ రెడ్డి - తరుణ్ భాస్కర్ - క్రిష్ - శరత్ మరార్ - స్వప్న దత్ లాంటి దర్శక నిర్మాతలు వెబ్ వరల్డ్ లో అడుగులు పెట్టేసారు. ఈ క్రమంలో ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కూడా వెబ్ వరల్డ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ ఒకవైపు సినిమాలు డైరెక్ట్ చేస్తూనే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'ఉప్పెన' సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారితో కలిసి నిర్మిస్తున్న సుకుమార్ వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. ''లవ్ స్టోరీస్'' పేరుతో సుకుమార్ వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన వారు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. ఈ వెబ్ సిరీస్ ని సుక్కు ప్రొడక్షన్ హౌస్ లో అతని అసిస్టెంట్స్ డైరెక్షన్ చేయనున్నారట. ఇప్పటికే వెబ్ సిరీస్ కోసం తెలుగు ఓటీటీ 'ఆహా'తో ఒప్పందం కూడా చేసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం మిగతా ఓటీటీలతో పోటీ పడుతున్న 'ఆహా' కోసం సుకుమార్ లాంటి వారు కలిస్తే క్రేజ్ పెంచుకోవచ్చని అల్లు అరవింద్ భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్నాలు వెయిట్ చేయాల్సిందే. కాగా సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.