Begin typing your search above and press return to search.
సుక్కు లవ్ స్టోరీ తెలుసా మీకు?
By: Tupaki Desk | 21 Jan 2016 5:30 AM GMTనాన్నకు ప్రేమతో మూవీ రెండో వారంలోకి ఎంటర్ అయింది. తొలివారం అంత రేంజ్ లో కలెక్షన్స్ రాకపోయినా, సెకండ్ వీక్ లో కూడా స్ట్రాంగ్ గానే ఉంది. మొదట మిక్సెడ్ టాక్ వచ్చిన నాన్నకు ప్రేమతో.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ రూట్ లో దూసుకుపోతోంది. అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ డ్రాప్ అవకపోవడంతో.. సుకుమార్ మంచి హ్యాపీగా ఉన్నాడు. వన్ నేనొక్కడినే లాంటి ఫ్లాప్ తర్వాత వచ్చిన సూపర్ హిట్ కావడంతో, ఈ ఆనందం మరింత ఎక్కువ అని చెప్పాలి.
ఈ హ్యాపీనెస్ లోనే సుకుమార్ తన లవ్ స్టోరీ కూడా పంచుకున్నాడు. ఆర్య సినిమా చూసిన ఎవరికైనా.. ప్రేమ అనే ఫీలింగ్ పై మక్కువ కలగడం సహజం. ముఖ్యంగా వన్ సైడ్ లవ్ అంత గొప్ప లవ్ లేదు అనే లాజిక్ తో, కుర్రకారుని బాగా ఎట్రాక్ట్ చేశాడు సుకుమార్. ఆ మూవీ రిలీజ్ సమయంలో హైద్రాబాద్ లోని సుదర్శన్ థియేటర్ కు వెళ్లాడట సుక్కు. అక్కడ ఓ అమ్మాయి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే, సుకుమార్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడట. తను డైరెక్టర్ అని తెలిసి, టెక్నీషియన్స్ అందరూ పని చేస్తుంటే, డైరెక్టర్ అసలేం చేస్తాడు అని అడిగిందట ఆమె.
దీంతో బాగా హర్ట్ అయిన సుక్కు, దర్శకత్వం అంటే ఎంత కష్టమో వివరించాడట. తర్వాత వీళ్లిద్దరి మధ్యలో ప్రేమ పుట్టింది. వీరి ప్రేమకు హంసిని(సుకుమార్ భార్య) పెద్ద వాళ్లు ఒప్పుకోలేదు. ఐదేళ్ల పాటు ప్రేమించాక సుక్కు సైడ్ వారి ఆశీస్సులతో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత అమ్మాయి పేరెంట్స్ నుంచి కూడా ఆశీర్వాదం పొందారు. ఇప్పుడు వీళ్లకు ఓ అమ్మాయి - అబ్బాయి.. అంతా హ్యాపీసే లెండి. కాకపోతే తనతో టైమ్ ఎక్కువ గడపడం లేదని అప్పుడప్పుడూ అంటూ ఉంటుందిట సుకుమార్ భార్య.